IPO News: ఫార్మా ఐపీవో లాభాల మందు.. తొలిరోజే ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు..
Emcure Pharmaceuticals IPO: నేడు మార్కెట్లోకి వచ్చిన రెండవ మెయిన్ కెటగిరీ ఐపీవో సైతం మంచి లాభాలతో తన ప్రయాణాన్ని మెుదలుపెట్టింది. దీంతో ఇన్వెస్టర్లు సంతోషంలో మునిగితేలుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లోకి వచ్చిన ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఐపీవో గురించే. దలాల్ స్ట్రీట్‌లో కంపెనీ షేర్లు బలమైన అరంగేట్రం చేశాయి. ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు 31.45 శాతం ప్రీమియంతో రూ.1,008 ధర వద్ద అడుగుపెట్టగా.. బీఎస్ఈలో అదే ప్రీమియంతో జాబితా అయ్యాయి. వాస్తవానికి లిస్టింగ్ ఇన్వెస్టర్లు ఆశించిన స్థాయిలోనే ఉంది.

లిస్టింగ్ ముందు గ్రేమార్కెట్లో ఎంక్యూర్ ఫార్మా షేర్లు ఒక్కో షేరుకు రూ.300 చొప్పున లాభంతో ట్రేడ్ అయ్యాయి. ఇది పెట్టుబడిదారులకు దాదాపు 30 శాతం లిస్టింగ్ పాప్‌ని సూచించింది. వాస్తవానికి ఐపీవో ఇష్యూ జూలై 3 నుంచి జూలై 5 వరకు బిడ్డింగ్ కోసం తెరవబడింది. పూణే ఆధారిత ఫార్మా కంపెనీ ఐపీవో లాట్ పరిమాణాన్ని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 14గా నిర్ణయించింది. ఈ క్రమంలో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.960-1008గా ఉంచింది. ఐపీవో ఇన్వెస్టర్ల నుంచి మెుత్తం రూ.1952.03 కోట్లను విజయవంతంగా సమీకరించింది. అయితే ఇందులో రూ.800 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ సైతం ఉన్న విషయం తెలిసిందే.
ఇష్యూ మొత్తం 67.87 రెట్లు సాలిడ్ సబ్‌స్క్రైబ్ చేయబడింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్ల కోటా 195.83 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 48.32 రెట్లు సబ్‌స్క్రయిబ్ పొందాయి. మూడు రోజుల బిడ్డింగ్ ప్రక్రియలో రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల కోసం రిజర్వు చేయబడిన భాగాలు వరుసగా 7.21 రెట్లు, 8.81 రెట్లు వేలం వేయబడ్డాయి. ఇక కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే.. స్వదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎమ్‌క్యూర్ ఫార్మా 1981లో స్థాపించబడింది. ఇది అనేక ప్రధాన చికిత్సా రంగాల్లో విస్తృత శ్రేణి ఔషధ ఉత్పత్తులను అభివృద్ధి, తయారీ మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీకి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 13 తయారీ యూనిట్లు ఉన్నాయి. కంపెనీ తన ఉత్పత్తులను విదేశీలకు సైతం ఎగుమతి చేస్తోంది.


Click it and Unblock the Notifications