Twitter: ట్విట్టర్ కొత్త యజమానిగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టటంతో ట్విట్టర్ పునాదుల నుంచి మార్పులు ప్రారంభమయ్యాయి. ఖర్చులను తగ్గించుకోటంలో భాగంగా ఎలాంటి వివక్ష లేకుండా టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా చాలా మందిని తొలగించటం అందరిలోనూ గుబులు రేపుతోంది. కంపెనీకి రోజు రూ.34 కోట్లు నష్టం వస్తోందని.. తనకు మరో మార్గం లేదని మస్క్ ఇటీవల ఉద్యోగులకు తెలిపారు.

ఉద్యోగికి భారీ షాక్..
తొలగింపుల క్రమంలో హెర్నాన్ అల్వారెజ్ లూయిసికా అనే ఉద్యోగిని ట్విట్టర్ తొలగించింది. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకు కోసం సెలవులో ఉన్న సమయంలో అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్న అతడిని ఎలాన్ మస్క్ తొలగించటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తనకు చాలా అవసరమైన సమయంలో కొత్త ట్విట్టర్ తనను నిరాశపరిచిందని అన్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న కొడుకును కాపాడుకునే క్రమంలో సంక్షోభం రావటంపై చింతించాడు.

సహోద్యోగులకు మెసేజ్..
"నా స్నేహితులకు మరోసారి ధన్యవాదాలు. మీరందరూ అద్భుతమైన వ్యక్తులు, ప్రతిభావంతులైన నిపుణులు. తదుపరి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. మరీ ముఖ్యంగా తాము హెల్త్ ఇన్సూరెన్స్ పొందాలని ఆశిస్తున్నట్లు" లూయిసికా తెలిపారు. ప్రస్తుతం తొలగించబడిన ఈ ఇంజనీర్ 2021 జనవరిలో లింక్డ్‌ఇన్ ద్వారా ట్విట్టర్‌లో చేరారు. ట్విటర్‌లో లొయిసికా మాత్రమే కాదు, ఇంకా చాలా మంది కష్టాల్లో ఉన్నారని, వారిని సైతం కంపెనీ తొలగించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సదరు ఇంజనీర్ పోస్ట్ కు లింక్డ్‌ఇన్ పేజీలో అనేక మంది స్పందిస్తున్నారు.

50% తొలగింపు..
ట్విట్టర్‌లో ఇలాంటి తొలగింపులు చాలానే ఉన్నాయి. ట్విట్టర్‌లో మొత్తం 7500 మందిలో 50% మందిని తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఆదాయం నెపంతో దాదాపు 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నట్లు సమాచారం. మరో పక్క టెస్లా నుంచి చాలా మందిని ట్విట్టర్ లోకి ఎలాన్ మస్క్ తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెవెన్యూ పెంచుకోవటానికి ట్విట్టర్ బ్లూ సేవల ఛార్జీని నెలకు 8 డాలర్లుగా నిర్ణయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.

ప్రవాస భారతీయులు..
ప్రవాస భారతీయులు సైతం ఎలాన్ మస్క్ నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు. H-1B వీసాలతో పాటు L-1, O-1 వీసాపై ట్విట్టర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ తొలగింపు వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరికి కంపెనీ 60 రోజులు గడువు ఇవ్వటంతో ఈ లోపు వారు మరో ఉద్యోగం లేదా ప్రత్యామ్నాయ పనిని చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Twitterలో పనిచేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులు H-1B వీసాలు కలిగి ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఈ వీసా స్పాన్సర్ చేసే మరో కంపెనీలో జాబ్ వెతుక్కోవాలి లేకుంటే చిక్కుల్లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అరుదైన పరిస్థితులలో తప్ప, ఉద్యోగాన్ని రద్దు చేసిన తర్వాత వారు వెంటనే వెళ్లిపోవాల్సి రావచ్చు.

ఉద్యోగులను రీకాల్ చేస్తోన్న ట్విట్టర్..
ఫెడరల్ లేబర్ చట్టాల ప్రకారం 100 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీ 60 నోటీస్ పిరియడ్ ఇచ్చి ఉద్యోగులను తొలగించాలి. దీనిని ఎలాన్ మస్క్ పాటించకపోవటంతో గత వారం కేసు నమోదైంది. ఈ క్రమంలో తొలగించిన కొంతమంది ఉద్యోగులను ట్విట్టర్ తిరిగి పిలిచినట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది. వారు ట్విట్టర్ ద్వారా తప్పుగా తొలగించబడ్డారని.. తిరిగి పనిలోకి రావాలని కంపెనీ యోచిస్తోందని నివేదించబడింది. వారి అనుభవం కంపెనీకి అవసరమని చెప్పినట్లు సమాచారం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications