మోదీని కంట్రోల్ చేస్తున్న Elon Musk! ఇండియాలో టెస్లా నియామకాలు, యూఎస్ విజిట్ ఎఫెక్ట్
Tesla Hiring: గతవారం భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు, దైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ పర్యటన ముగించుకున్న తర్వాత కొన్ని ఆసక్తికర పరిణామాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇన్నాళ్లుగా ఎలాన్ మస్క్ టెస్లా భారతీయ ఎంట్రీకి అనేక అడ్డంకులు ఎదురవుతున్న సంగతి మనం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. మోదీ అమెరికా పర్యటన తర్వాత అకస్మాత్తుగా టెస్లా భారతదేశంలో ఉద్యోగుల నియామకం ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా 13 మందిని వివిధ పాత్రల కోసం నియమించుకోనున్నట్లు పేర్కొంది. కంపెనీ ఇటీవల తన లింక్డ్ఇన్ పేజీలో అప్‌లోడ్ చేసిన జాబ్ పోస్టింగ్‌ల ప్రకారం కస్టమర్-ఫేసింగ్, బ్యాక్-ఎండ్ ఉద్యోగాల కోసం ఓపెనింగ్ పడ్డాయి.

ప్రస్తుతం టెస్లా కొత్త నియామకాలను ముంబై, దిల్లీ కేంద్రంగా చేపడుతోందని వెల్లడైంది. సర్వీస్ టెక్నీషియన్ నుంచి అడ్వైజర్ వరకు వివిధ పాత్రలక కోసం నియామకాలను చేపట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తోందని వెల్లడైంది. టెస్లా ప్రస్తుతం ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, సర్వీస్ అడ్వైజర్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, సర్వీస్ మేనేజర్, టెస్లా అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, స్టోర్ మేనేజర్, సర్వీస్ టెక్నీషిన్ పొజిషన్స్ కోసం నియామకాలను చేపడుతోందని కంపెనీ పేర్కొంది.
గడచిన కొన్ని సంవత్సరాలుగా టెస్లా ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ కోసం చేస్తున్న ప్రయత్నాలు, సంప్రదింపులు పెద్దగా ఫలించలేదు. ఇండియాలో తయారీని చేపడితేనే పన్ను మినహాయింపులు ఇస్తామని మోదీ సర్కార్ చెప్పటంతో చాలా కాలంగా అనిశ్చితి కొనసాగిన సంగతి తెలిసిందే. ఇండియా ప్రస్తుతం 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన హై-ఎండ్ కార్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 110% నుంచి 70 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తిదారుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిని 2070 నాటికి సున్నా స్థాయిలకు తీసుకొచ్చే క్రమంలో ఉద్ఘరాలను తగ్గించేందుకు ఈవీలవైపుకు భారత్ మెుగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.
భారీగా భారత్ దిగుమతి సుంకాలను విధించటంపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లో మస్క్ భారతదేశాన్ని సందర్శించి ప్రధాని నరేంద్ర మోడీని కలవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇండియాలో టెస్లా తయారీ యూనిట్ ఏర్పాటు ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications