Elon Musk: ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత దాని రూపురేకలను పూర్తిగా మార్చే పనిలో ఉన్నారు. దాదాపు 44 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు తర్వాత దానిని లాభదాయకంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ X రెండు ప్రీమియం టైర్‌లను పరిచయం చేసింది. ఇందులో యాడ్-ఫ్రీ అనుభవం కోసం చెల్లించడానికి ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రీమియం+ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి యాడ్స్ లేకుండా సేవలను పొందేందుకు నెలకు 16 డాలర్లు అంటే రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే మరో బేసిక్ వర్షన్ ప్లాన్ కింద నెలకు 3 డాలర్లు అంటే రూ.243.75ను రుసుముగా కంపెనీ ఖరారు చేసింద. ఈ ఖాతాలకు బ్లూ చెక్‌మార్క్‌ను కలిగి ఉండదు. ఇది పోస్ట్‌లను సవరించడం, పొడవైన టెక్స్ట్, వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రెండు కొత్త ప్లాన్‌లు వెబ్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ఎలాన్ మస్క్ కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత.. లైవ్‌స్ట్రీమింగ్, వీడియో అండ్ ఆడియో కాల్‌లతో సహా Xకి కొత్త ఫీచర్‌ల శ్రేణిని జోడించాడు. త్వరలోనే డిజిటల్ చెల్లింపుల వంటి బ్యాంకింగ్ సేవలను కూడా చేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చే ప్రయత్నంలో ఎలాన్ మస్క్ ఉన్నారని తెలుస్తోంది. భారతీయ వినియోగదారులకు ఎక్స్ ప్రీమియం డెస్క్ టాప్ యాప్ సేవలు ఏడాదికి రూ.6,800, నెలకు రూ.650 రేటుకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మెుబైల్ యాప్ సేవలు ఏడాదికి రూ.9,400, నెలకు రూ.900 ప్లాన్లలో అందిచబడుతున్నాయి.


Click it and Unblock the Notifications