Threads vs Twitter: మెటా అంతుచూస్తానంటున్న మస్క్ మామ.. మార్క్ దిమ్మతిరిగే రిప్లై..
అచ్చుగుద్దినట్లు ట్విట్టర్ కాపీలాగా థ్రెడ్స్ తయారు చేయటం కొంత వివాదాలకు కారణంగా మారుతోంది. ఈ క్రమంలో మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ మార్క్ జుకర్ బర్గ్ సంస్థ మెటాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది. ఈ విషయంలో వార్తా ప్లాట్‌ఫారమ్ సెమాఫోర్ మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్‌కు ట్విట్టర్ న్యాయవాది అలెక్స్ స్పిరో పంపిన లేఖను పొందటంతో విషయం బయటకొచ్చింది.
మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ మెటా.. థ్రెడ్ యాప్ అభివృద్ధి చేయడానికి ట్విట్టర్ బిజినెస్ సీక్రెట్స్, మేధో సంపత్తిని ఉపయోగించిందని న్యాయవాది పంపిన లేఖలో రాసి ఉంది. ఇందుకోసం మెటా భారీ సంఖ్యలో మాజీ ట్విటర్ ఉద్యోగులను నియమించుకుందని తెలిపారు. "కాపీక్యాట్" యాప్‌ను అభివృద్ధి చేయడానికి ఈ ఉద్యోగులను మెటా వినియోగించుకుందని, ఇది చట్టాల ఉల్లంఘించమేనని ట్విట్టర్ ఆరోపించింది.

ఈ క్రమంలో సివిల్, ఇంజంక్టివ్ రిలీఫ్ చర్యలకు దిగుతామని బెదిరిస్తోంది. మెటా వెంటనే ట్విట్టర్ వ్యాపార రహస్యాలు, గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించటం మానుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై మెటా తరఫున గట్టి రిప్లై వచ్చింది. ఈ వ్యవహారంపై మెటా నుంచి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆండీ స్టోన్ థ్రెడ్స్‌లో పోస్ట్ ద్వారా బదులిచ్చారు. అసలు ట్విట్టర్ వాదనలో నిజం లేదని.. థ్రెడ్స్ అభివృద్ధి చేసిన టీమ్‌లోని ఇంజనీర్‌లు ఎవరూ ఇంతకుముందు Twitter కోసం పని చేయలేదని స్పష్టం చేస్తూ ట్విట్టర్ వాదనను ఖండించారు. థ్రెడ్స్ ప్రారంభించిన 24 గంటల్లోనే 30 మిలియన్లకు పైగా వినియోగదారులను పొందింది.
చట్టపరమైన చర్యలకు సంబంధించిన ఒక వార్తకు ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. పోటీ మంచిదేనని అయితే మోసం చేయటం సరికాదంటూ బదులిచ్చారు. ఈ స్పందన రెండు కంపెనీల మధ్య కొనసాగుతున్న పోటీకి ఆజ్యం పోస్తుంది.


Click it and Unblock the Notifications