Twitter Blue: ట్విట్టర్ యూజర్లకు ఇకపై సర్వీస్ ఛార్జీల మోత మోగనుంది. ఇకపై ధృవీకరణ కోసం వినియోగదారులు భారీగా చెల్లించుకోక తప్పదు. ప్రస్తుతం ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందుతున్న ఖాతాదారులు నెలకు 4.99 డాలర్లను రుసుముగా చెల్లిస్తున్నారు. అయితే మస్క్ రాకతో ఈ సబ్‌స్క్రిప్షన్ ధర భారీగా పెరుగుతోంది.
90 రోజులు గడువు..
అయితే కొత్త నిబంధనల ప్రకారం యూజర్లు ప్రస్తుత ప్లాన్‌లో సభ్యత్వాన్ని పొందేందుకు 90 రోజులు గడువు ఇవ్వబడింది. ధృవీకరణను సూచించే ట్విట్టర్ బ్లూ చెక్‌మార్క్ పొందే ఖాతాదారులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ఇకపై వీటిని పొందటానికి నెలకు వినియోగదారులు 19.99 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. తొలుత ఈ సేవలను కంపెనీ కేవలం 2.99 డాలర్లకు అందించింది.

ఆదాయం కోసం..
వ్యాపారం మొత్తం ఆదాయంలో సగభాగాన్ని కవర్ చేయడానికి సబ్‌స్క్రిప్షన్‌లను పెంచాలని మస్క్ భావిస్తున్నారు. ఖాతాలను ధృవీకరించే ప్రక్రియను మెరుగుపరుస్తామని.. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను సవరిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ బ్లూ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు నవంబర్ 7 వరకు గడువు ఇచ్చారు. ఈ గడువులోగా ఈ పని పూర్తికాకపోతే విధుల నుంచి తొలగిస్తామన్నారు.

ఉద్యోగుల తొలగింపు..
మస్క్ ఈ ప్రాజెక్ట్‌ల కోసం టెస్లా నుంచి ఇంజనీర్లను ట్విట్టర్‌లో కన్సల్టెంట్‌లుగా నియమించుకున్నారు. కోడ్ బేస్‌కు సహకరించని మిడిల్ మేనేజర్లు, ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని భారీ తొలగింపులను ఇది ప్లాన్ చేస్తోంది. నిర్వాహకులు ఈ వారంలో తగ్గించాల్సిన కార్మికుల జాబితాలను రూపొందించారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అర్థరాత్రులు, వారాంతాల్లో కూడా పని చేస్తున్నారు.

ట్విట్టర్ బ్లూ అంటే ఏమిటి?
ట్విట్టర్ ఒక పబ్లిక్ మెసేజింగ్ యాప్. కేవలం కొన్ని పదాల్లో యూజర్లు తమ సందేశాన్ని, మెసేజ్ ను ఇతరులకు అందించేందుకు వీలుగా దీనిని ప్రారంభించారు. అయితే తర్వాత దీనికి ఫోటోలు, వీడియోలు పంచుకునే ఫీచర్లు వచ్చి చేరాయి. అందువల్ల ప్రత్యేక గుర్తింపును రక్షించటానికి యూజర్లకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. దాని కింద మీరు వెరిఫైడ్ యూజర్ అని వెరిఫై చేసుకున్న వారికి బ్లూ టిక్ ఇవ్వబడుతుంది. ఈ యూజర్లకు ఎడిటింగ్, పోస్ట్ చేసిన ట్వీట్‌లను అన్‌డూ చేసుకునేందుకు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications