కిల్లర్ ఫీచర్స్‌తో టెస్లా ఫోన్.. అంగారక గ్రహం నుంచీ కాల్స్ చేయొచ్చు.. మస్క్ మామపై ప్రశ్నల వర్షం
Tesla Phone: ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీశారు. ఇటీవల ట్విట్టర్ లోగోను పక్షి నుంచి 'X' కు మార్చి విమర్శల పాలయ్యారు. కాగా ఇప్పుడు కొత్తగా మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించి, ఫీచర్స్ కూడా వెల్లడించారు. అయితే అవి సాధ్యం కాదని పలువురు బాహాటంగానే విమర్శిస్తుండటం విశేషం.
ఎలాన్ మస్క్ ట్విట్టర్లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుంత నెట్టింట సంచలనంగా మారింది. టెస్లా ఫోన్ ఉపయోగించడానికి ఆసక్తి ఉందా అంటూ యూజర్లను అందులో ప్రశ్నించారు. దీనికి సూపర్ స్టన్నింగ్ ఫోన్ పిక్ ఒకటి జత చేశారు. అది కాస్తా వెనుక టెస్లా పేరుతో, మోటాలిక్ లుక్ లో అదరగొడుతోంది. ఫాంటసీ సినిమాల్లో టెక్నికల్ డివైస్ లాగా ఇట్టే మనసు దోచేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టెస్లా ఫోన్ పిక్ షేర్ చేయగానే ట్విట్టర్ యూజర్లు మస్క్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. దాని ఫీచర్లు, కనెక్టివిటీ గురించి ఎక్కువగా క్వశ్చన్ చేశారు. ఈ ఫోన్ స్టార్ లింక్ కి కనెక్ట్ చేయబడి శాటిలైట్ మొబైల్ తరహాలో ఉపయోగించవచ్చా అని ప్రశ్నించగా, అలా చేయొచ్చని మస్క్ సమాధానమిచ్చారు.
నెలకు 100 డాలర్లతో స్టార్ లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించే విధంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే తాను ఆసక్తిగా ఉన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మార్స్(అంగారక) గ్రహం నుంచి కూడా ఉపయోగించుకోవచ్చని మస్క్ తెలిపారు. ఐఫోన్ 12 మినీతో ఏవైనా పోలిక ఉంటుందా అని ప్రశ్నించగా.. దానికంటే మెరుగ్గా ఉంటుందని, ఏమాత్రం తక్కువ కాదని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications