బిట్‌కాయిన్ మైనర్స్‌తో మస్క్ చర్చలు, మళ్లీ క్రిప్టోకరెన్సీ జంప్
అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ చివరి సెషన్‌లో 10 శాతానికి పైగా లాభపడి 39,400 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు ప్రారంభ సెషన్‌లో 7.5 శాతం పతనమైంది. ఆ తర్వాత పుంజుకుంది. అయినప్పటికీ గత నెలలోని ఆల్ టైమ్ గరిష్టం 65వేల డాలర్లతో పోలిస్తే 40 శాతం వరకు తక్కువగా ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 19 శాతం లాభపడి 2,491 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు ఆదివారం సెషన్‌లో 8 శాతం పడిపోయింది. బిట్ కాయిన్ ఈ ఏఢాది 35 శాతం ఎగిసి, 40 శాతం క్షీణించింది.

పుంజుకున్న క్రిప్టో
టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన ట్వీట్ బిట్ కాయిన్ వ్యాల్యూ పైన ప్రభావం చూపింది. దీనికి తోడు చైనా నిర్ణయాలు ప్రభావం చూపాయి. అయితే తాజాగా మస్క్ బిట్ కాయిన్ మైనర్స్‌తో చర్చలు జరిపారు. దీంతో అమ్మకాల ఒత్తిడి నుండి తిరిగి పుంజుకోవడం ప్రారంభించింది. తాజాగా ఆయన మైనర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా ట్వీట్ చేశారు. తాను నార్త్ అమెరికన్ మైనర్స్‌తో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఇది క్రిప్టోకరెన్సీకి సానుకూలంగా మారింది. అయితే నేడు బిట్ కాయిన్ వ్యాల్యూ క్షీణించింది.

ఎలాన్ మస్క్ ట్వీట్
రెండు వారాల క్రితం ఎలాన్ మస్క్ ట్వీట్ సంచలనం కలిగించింది. బిట్ కాయిన్‌ను యాక్సెప్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో బిట్ కాయిన్ భారీగా ఎగిసింది. ఆ తర్వాత టెస్లా ఇంక్ పెట్టుబడులు పెట్టడంతో బిట్ కాయిన్ ఎగిసిపడింది. అయితే అదే టెస్లా అధినేత ట్వీట్ కారణంగా మార్కెట్ వ్యాల్యూ పతనమైంది. బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ ఇటీవల దాదాపు 500 బిలియన్ డాలర్లు పతనమైంది.

మళ్లీ ర్యాలీ
బిట్ కాయిన్ మళ్లీ ర్యాలీ చేస్తుందని, ఇటీవల దిద్దుబాటుకు గురయినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. లాంగ్ టర్మ్‌లో బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టవచ్చునని చెబుతున్నారు. బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోలు ఇటీవలి కాలంలో పతనమయ్యాయని, ప్రస్తుతం పెట్టుబడి పెట్టవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications