Elon Musk: అపర కుబేరుడు, ట్విట్టర్ మరియు స్పేస్ X అధినేత ఏది చేసినా ఓ సంచలనమే. ఒక్క ట్వీట్ ద్వారా ఆయా కంపెనీల షేర్లను అమాంతం పెంచేయనూ గలరు, నేలమట్టమూ చేయగలరు. అంతటి సత్తా ఉన్న వ్యక్తి ఆయన. తన కంపెనీ ట్విట్టర్ గురించి తాజాగా మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
స్మార్ట్ ఫోన్‌లలో ట్విటర్ యాప్ అధిక స్పేస్ ఆక్రమిస్తుండటంతో వినియోగదారులకు దాని CEO ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగానే ట్వీట్ చేశారు. ట్విట్టర్ యాప్ ఓ ఫోన్ లో 9.52GB మెమరీని ఆక్రమించిందని వెల్లడించే స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు. ప్లాట్ ఫారంలో తాను అమలుచేసిన మార్పుల వల్ల ట్విట్టర్ వినియోగం విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఫలితంగా యూజర్లు ఈ తరహా స్పేస్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారన్నారు.

గత మార్చిలోనూ ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ వేగవంతమైన వృద్ధిని మస్క్ ప్రస్తావించారు. రోజుకు 8 బిలియన్ యూజర్ నిమిషాలను అధిగమించిందని ప్రకటించారు. ఆ వినియోగదారులు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మరియు తెలివైన వ్యక్తులని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ట్విట్టర్ ఫాలోవర్స్, ధృవీకరించబడిన, ధృవీకరించని ఖాతాల నుంచి వచ్చే స్పందనల ఆధారంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రత్యక్ష ఆడియో సంభాషణ ఫీచర్ అయిన Twitter Spacesలో.. 2024 US అధ్యక్ష ఎన్నికల బిడ్ సమయంలో జరిగిన సాంకేతిక పరాజయం గురించి మస్క్ ఇటీవల మాట్లాడారు. సాంకేతిక లోపాన్ని సాంప్రదాయ మీడియా ఎలా చిత్రీకరిస్తుందనే విషయంపై కొంత వ్యంగ్యంగా స్పందించారు. ఈ వార్తను భూమిపై అగ్ర కథనంగా ఆయా న్యూస్ ఏజెన్సీస్ పేర్కొన్నట్లు గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications