టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో 3 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన 9.2 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేశారు. ఇందుకు ఆయన ఓపెన్ మార్కెట్ నుండి 7.35 కోట్ల ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల కోసం ఈ షేర్లు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కొనుగోలు తర్వాత ట్విట్టర్ షేర్లకు డిమాండ్ పెరిగింది. సోమవారం మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్ 26 శాతం లాభాల్లో ట్రేడ్ అయింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సమస్యలు ఏర్పడుతున్నాయని ట్వీట్ చేసిన కొద్ది రోజులకే మస్క్ ట్విట్టర్ ఈక్విటీలో వాటా కొనుగోలు చేయడం గమనార్హం.
ట్విట్టర్‌లో వాక్‌స్వాతంత్ర్యంపై ప్రశ్నలు పెరుగుతున్నాయని కొత్త సామాజిక మాద్యమాన్ని సృష్టించే విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు గతంలో ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. దీంతో ట్విట్టర్‌కు పోటీగా మరో సోషల్ మీడియా అనుసంధాన వేదికను తీసుకు వస్తారని అందరూ భావించారు. కానీ ఆయన అదే ట్విట్టర్‌లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ 1న ట్విట్టర్ షేర్ 40 డాలర్ల లోపు ఉంది. నాలుగో తేదీన ఏకంగా 50 డాలర్లకు చేరువైంది.

ఎలాన్ మస్క్ ఏప్రిల్ 4వ తేదీన మరో ప్రశ్నను ట్విట్టరిటీల ముందు ఉంచారు. ఎడిట్ బటన్ ఉండాలా? అని మస్క్ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌పై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. ఈ పోల్ పరిణామాలు చాలా ముఖ్యమైనవని, చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని ట్వీట్ చేశారు.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications