Elon Musk: ఎలాన్ మస్క్‌కు ఇచ్చిపడేసిన ఆపిల్ CEO.. మాటల్లేవ్, కేవలం ట్వీట్స్‌తోనే స్ట్రాంగ్ కౌంటర్
Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం X(గతంలో ట్విట్టర్) బాస్ ఎలాన్ మస్క్.. మొన్నటిదాకా ఐఫోన్ తయారీదారు ఆపిల్ పై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. కానీ అంతలోనే అందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటన చేసి ఆశ్చర్యపరిచారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడిది వైరల్ గా మారింది.
ఆపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్ లాంచ్ అవుతుందంటే.. మార్కెట్లో ఉండే బజ్ వేరు. తాజాగా రిలీజ్ అయిన్ ఐఫోన్ 15 సిరీస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. మొన్నటి దాకా ఆపిల్ కొత్త సిరీస్ లో కెమెరాపై మస్క్ చులకనగా మాట్లాడారు. కాగా ఆ కంపెనీ CEO షేర్ చేసిన పోస్ట్ లను చూసి దిమ్మ తిరిగినట్లయింది. దీంతో ఇప్పుడు యూటర్న్ తీసుకుని తాను కూడా ఒక ఐఫోన్ కొంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్‌లు స్టీఫెన్ విల్క్స్, రూబెన్ వు తీసిన చిత్రాలను ఆపిల్ CEO Xలో షేర్ చేశారు. రోడ్ ఐలాండ్ లోని వేసవి అందాలు, ఉటాలో ఎడారుల వీక్షణాలతో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సృజనాత్మకతను, వారి పనితనాన్ని తనకు చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఐఫోన్ తో తీసిన ఈ ఫొటోలు, వీడియోలు అత్యద్భుతంగా ఉన్నాయంటూ టిమ్ పోస్ట్ కు మస్క్ రిప్లై ఇవ్వడం విశేషం.
న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూలోని ఆపిల్ స్టోర్ లో ఉత్పత్తుల లాంచ్ ఫొటోలనును టిమ్ కుక్ పోస్ట్ చేశారు. అక్కడ కొత్త ప్రొడక్ట్స్ లైనప్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఐఫోన్ 15 సిరీస్, మొదటి కార్బన్-న్యూట్రల్ వాచెస్ సహా ఎయిర్ పాడ్ లు ఇక్కడ లభిస్తాయని ప్రకటించారు. అయితే తాను కూడా ఒకటి కొంటున్నట్లు మస్క్ ఈ పోస్టుకు సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచారు.


Click it and Unblock the Notifications