Elon Musk: ట్విట్టర్ పై ప్రజా నిర్ణయం కోరిన ఎలాన్ మస్క్.. ఒకవేళ అలా జరిగితే పరిస్థితి..?
Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు అహర్నిశలు శ్రమించాడు ఎలాన్ మస్క్. అయితే అడుగుపెట్టినప్పటి నుంచి కంపెనీని నిలబెట్టాలని చూస్తున్నారా.. లేక కంపెనీని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాడా అని అందరూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో అసలు తాను కొన్న రేటుకే మస్క్ కంపెనీని అమ్మేయాలి అని అనుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మస్క్ పోల్..
ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత బిలియనీర్ ఎలోన్ మస్క్ కంపెనీకి చీఫ్‌గా ఉన్నారు. అయితే ఆయన ఇప్పుడు తన పదవిలో కొనసాగాలా లేక దానిని వీడాలా అనే అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. ఇందుకోసం ట్విట్టర్లో ఒక పోల్ నిర్వహించారు. ట్విట్టర్ హెడ్ పదవి నుంచి తాను దిగిపోవాలా అనే ప్రశ్నకు నెటిజన్లు సైతం భారీగానే స్పందిస్తున్నారు. శనివారం రాత్రి పోల్ ప్రారంభం కాగా ఇందులో వచ్చే ఫలితానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన అనటం అందరినీ అశ్చర్యానికి గురిచోస్తోంది.
ఓట్ల వివరాలు..
ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1.2 కోట్ల మంది తమ ఓటును పోల్ లో వేశారు. ఇప్పటి వరకు నమోదైన ఓట్ల ప్రకారం 56.5 శాతం మంది ఆయన పదవి నుంచి వైదొలగాలని అన్నారు. మిగిలిన వారు మాత్రం ఆయనే కొనసాగాలని కోరుతున్నప్పటికీ ఈ పోల్ ముగియటానికి ఇంకా 4 గంటల సమయం మిగిలి ఉంది. ఈ క్రమంలో పోల్ తుది ఫలితాలు వచ్చేనాటికి నెటిజన్లు ఏమి కోరుకుంటున్నారో వెల్లడికానుంది.

ఇప్పటికే సీఈవో..?
ఎలాన్ మస్క్ ఇప్పటికే తన స్థానంలో కొత్త సీఈవోను ఇప్పటికే ఎంచుకున్నట్లు ఒక వ్యక్తి చేసిన ట్వీట్ పై ఎలాన్ మస్క్ స్పందించారు. వాస్తవానికి ట్విట్టర్ ను బతికి ఉండేలా ఉంచగల ఉద్యోగాన్ని ఎవరూ కోరుకోరంటూ మస్క్ దానికి బదులిచ్చారు. ఇది దిగజారిన ట్విట్టర్ ఆర్థిక పరిస్థితికి అద్ధం పడుతోందని తెలుస్తోంది. మెుత్తానికి ఎలాన్ మస్క్ మరో క్రేజీ పోల్ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications