Elon Musk: త్వరలోనే ఇండియాలో మస్క్ స్టార్ లింక్ సేవలు.. అంబానీకి చుక్కలే..!!
Elon Musk: ముఖేష్ అంబానీ తన టెలికాం వ్యాపారాన్ని చాలా వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఉచితాలను ఎరవేసి ప్రత్యర్థి కంపెనీలను నామరూపాలు లేకుండా చేసిన అంబానీకి ఎలాన్ మస్క్ స్టార్ లింక్ భయం మెుదలైంది.
అనేక అడ్డంకుల తర్వాత అమెరికా వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ సేవలను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు చూస్తున్నారు. దీనికి సంబంధించి భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి సంబంధింత అనుమతులను పొందనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టెలికాం వ్యాపారంలో కొనసాగుతున్న జియో ఆధిపత్యానికి కళ్లెం పడుతుందని తెలుస్తోంది. అందుకే మస్క్ ఎంట్రీని ప్రభుత్వ లాబీయింగ్ ద్వారా అంబానీ అడ్డుకుంటున్నారని గతంలోనూ వార్తలు గుప్పుమన్నాయి.

శాటిలైట్(GMPCS) సేవల లైసెన్స్ ద్వారా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ కోసం స్టార్‌లింక్ ప్రతిపాదన ఈ నెలాఖరులో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించబడనుంది. దీనికి సంబంధించి అంతరిక్ష శాఖతో పాటు అనేక ఇతర డిపార్టు మెంట్ల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాల్సి ఉంటుంది. భద్రతాపరమైన కారణాలను చూపుతూ దాదాపు ఏడాదిగా దేశంలో దేశంలో స్టార్‌లింక్ సేవల ప్రారంభాన్ని కేంద్ర హోమ మంత్రిత్వ శాఖ నిలిపివేసింది.
లైసెన్స్ లేకుండా సేవల కోసం చందాదారుల నుంచి అడ్వాన్స్ డబ్బు తీసుకున్నందుకు కంపెనీ 2021 చివరలో టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి విమర్శలను ఎదుర్కొంది. అలాగే దేశంలో దాని పరికరాల కోసం 5,000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్‌లర్ల కోసం ఒక్కొక్కరి నుంచి 99 డాలర్లను వసూలు చేసింది. ప్రస్తుతం సునీల్ మిట్టల్-మద్దతుగల One Web, Reliance Jio, లక్సెంబర్గ్-ఆధారిత SES ఇప్పటికే దేశంలో GMPCS లైసెన్స్‌లను పొందాయి. అయితే అమెజాన్ తన 'ప్రాజెక్ట్ కైపర్'ను ఇంకా ఇండియాకు తీసుకురాలేదు.


Click it and Unblock the Notifications