Elon Musk: అశ్లీలతకు బానిసైన అడవి బిడ్డలు.. మస్క్ మామ, ఎంత పనిచేశావయ్యా..?
Starlink News: ఎక్కడో మారుమూల అడవుల్లో తలదాచుకుంటున్న తెగలను సాధారణ ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని భావించాయి. ఇంటర్నెట్ తో వారిని అనుసంధానించడం ద్వారా ఈ పని మరింత సులువు అవుతుందని అంచనా వేశాయి. అయితే అదికాస్త బెడిసి కొట్టి, పలు అనర్థాలకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం అవుతోంది.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ ద్వారా అమెజాన్ ఫారెస్ట్ లో ఇంటర్నెట్ సేవలు కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. అడవిలోని పలు తెగలు కూడా దాన్ని వినియోగించుకుంటున్నాయి. వాటిలో 2 వేలు జనాభా కలిగిన మారుబోజ్ తెగ మొదటిసారి బయటి ప్రపంచంతో అనుసంధానించబడింది. అయితే మొదట్లో ఇంటర్నెట్ రావడంతో సంతోషపడినా.. రానురాను పరిస్థితి అధ్వానంగా తయారైనట్లు తెలుస్తోంది.

'ఇంటర్నెట్ రాక తమ జీవితాన్ని సులభతరం చేసిందని ప్రారంభంలో భావించాం. కానీ అది మా యువతను సోమరిపోతులుగా మార్చింది. ఇంటర్నెట్ దుర్వినియోగం వల్ల మా సంస్కృతికి ముప్పు వాటిల్లుతోంది. అంతకంతకూ పెరిగిపోతున్న అశ్లీలత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా యువతపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది' అని ఆ తెగకు చెందిన త్సేన్యామా మారుబో ఆందోళన చెందారు.
తమ ప్రాంతంలో ఇంటర్నెట్ ఆవిర్భావం ఒక గొప్ప వరంగా భావించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స సహా పలు ప్రయోజనాలను అందుకున్నామన్నారు. విష సర్పాలు బారిన పడితే వెంటనే వైద్య సహాయం లభించేదన్నారు. అధికారులు తమకు ఏదైనా సమాచారం అందించాల్సి వస్తే గతంలో రేడియోలను వినియోగించేవారు కాగా ఇప్పుడు ఇంటర్నెట్ కాల్స్ వల్ల అది మరింత తేలికయిందని చెప్పారు. ఇంత మంచి జరిగినా తమ యువత భవిష్యత్తుపై నెగిటివ్ ప్రభావం చూపుతోందంటూ ఆ తెగ పెద్దలు తీవ్ర విమర్శలు చేశారు.


Click it and Unblock the Notifications