Starlink in India: చాలా కాలంగా భారతదేశంలో ఎలాన్ మస్క్ సంస్థ స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ట్రంప్ గెలుపు ఇప్పుడు ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన మస్క్ ప్రస్తుతం ఆ ఫలాలను ఒక్కొక్కటిగా తన వ్యాపారంలో అందుకుంటున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు వేలం వేయకుండా స్పెక్ట్రమ్‌ను కేటాయించాలన్న భారత్ నిర్ణయానికి ఎలాన్ మస్క్ ఆమోదం తెలిపారు. కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించిన ఈ చర్య అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా జరిగిందని పేర్కొన్నారు. అయితే దీనికి ముందు మస్క్ చాలా కాలంగా ఇదే విషయంపై భారత ప్రభుత్వాన్ని కోరగా.. మరోపక్క టెలికాం దిగ్గజం జియో మాత్రం టెలికాం స్పెక్ట్రమ్ మాదిరిగానే శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కోసం వేలం నిర్వహించాల్సిందేనని ప్రతిపాదించారు. అయితే చివరికి ట్రంప్ గెలుపుతో అమెరికా ఆధిపత్యం మస్క్‌కి అనుకూలమైన ప్రకటన వచ్చేలా చేసింది.

భారతీయ కేంద్ర మంత్రి నుంచి కీలక ప్రకటన వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తూ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఒక పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రామిసింగ్ అంటూ ఒక్క మాటలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో భారత్ తీసుకున్న నిర్ణయంపై సానుకూలతను వ్యక్తం చేసినట్లు అర్థమౌతోంది. ఈ నిర్ణయం భారతీయ టెలికాం మార్కెట్లో స్టార్‌లింక్ లాంటి విదేశీ ఆటగాళ్ల ఎంట్రీకి మార్గం సుగమం చేస్తుందని తెలుస్తోంది. కేంద్రం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో ఈ నిర్ణయం ముఖేష్ అంబానీకి చెందిన జియో, సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌లకు ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. దేశీయ టెలికాం కంపెనీలు మాత్రం వేలం విదానం ఫెయిర్ మార్కెట్ ఉండేలా చేస్తుందని వాదిస్తున్నారు.
భారతదేశంలో ప్రస్తుతం జియో-ఎయిర్‌టెల్ భారతదేశ డిజిటల్ వృద్ధికి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌ను చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నాయి. కానీ ప్రభుత్వ కేటాయింపు వ్యూహం స్టార్‌లింక్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లను మార్కెట్‌లోకి సులభతరం చేస్తూ కేవలం ఆపరేటింగ్ లైసెన్స్‌ను కోరటంపై మల్లగుల్లాలు పడుతున్నారు. రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న భారత్ వంటి అధిక వినియోగదారులు కలిగిన మార్కెట్లోకి ఎంట్రీ స్టార్‌లింక్ కి కూడా చాలా కీలకమైనదిగా ఉంది. ఈ సమయంలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అనుమతులను ఇవ్వటం కంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రవేశ ఖర్చులను తగ్గిస్తుంది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలో స్టార్‌లింక్ విస్తరణకు భారత ప్రభుత్వ నిర్ణయం సానుకూలమైనదే అయినప్పటికీ ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. అదేంటంటే స్టార్‌లింక్ ఇతర దేశాల మాదిరిగానే ఇండియాలో కూడా ధరల నిర్మాణాన్ని ఎంచుకుంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలను కస్టమర్లు పొందడాన్ని అత్యంత ఖరీదైన మార్గంగా మార్చేస్తుంది. ఇందుకోసం మస్క్ భారతీయ మార్కెట్లలోని పోటీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ధరలకు మార్పులు చేయాల్సి ఉంటుందని టెలికాం రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే గనక జరగకపోతే రిలయన్స్ జియో లాంటి దేశీయ ఆటగాళ్లు ప్రైస్ సెన్సిటివిటీ ఆటతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి ఇలాంటి ఆటతోనే అంబానీ జియోను దేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజంగా మార్చిన సక్సెస్ మళ్లీ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారంలోనూ కనిపించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications