X Tv App: అందరూ చేయటానికి కష్టం అని భావించే పనులను పూర్తి చేయటంలో అమెరికా బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ దిట్ట. అంతరీక్షమైనా లేక అంతర్జాలమైనా తాను అనుకుంటే ఎందులోనైనా విజయం సాధించటానికి కొత్త ఆలోచనలతో ఎల్లప్పుడూ ముందుకు వస్తుంటాడు మస్క్ మామ. ఈ క్రమంలో ఎంటర్టైన్మెంట్ పరిశ్రమను తాజాగా బిలియనీర్ టార్గెట్ చేశారు.
గడచిన దశాబ్ధకాలంగా ప్రజలకు ఇంటర్నెట్ సేవలు చేరువై వినియోగం పెరగటంతో అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి OTT యాప్‌ల వినియోగం అంతర్జాతీయంగా పెరుగుతోంది. ప్రధానంగా అధిక జనబాహుళ్యం కలిగిన ఇండియాలో యూజర్లు వీటికి పెరుగుతున్నారు. తాజాగా వీటికి పోటీగా ఎలాన్ మస్క్ కొత్త యాప్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఎక్స్ టీవీ పేరుతో సొంతంగా ఓటీటీ యాప్ మస్క్ లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర పోటీదారులకు ఇది వ్యాపారంలో సవాలు విసరనుందని తెలుస్తోంది.

ఇది ఇతర OTTల మాదిరిగానే చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు, టీవీ కార్యక్రమాలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు మొదలైనవాటిని ఎక్స్ టీవీలోనూ చూసేందుకు వీలు ఉండనుంది. ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్ టీవీ బీటా వెర్షన్‌లో తొలిసారిగా XTV యాప్‌ను విడుదల చేసినట్లు ఎలాన్ మస్క్ ధృవీకరించారు. ఈ బీటా వెర్షన్ ప్రస్తుతం LG TV, Amazon Fire TV, Google TV పరికరాల్లో అందుబాటులో ఉంది. అయితే యాప్ అధికారిక లాంచ్ గురించి ఇప్పటి వరకు మస్క్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూసే సౌలభ్యం ఇందులో ఉండనుంది. అలాగే రీప్లే ఆప్షన్ ద్వారా యూజర్లు తమకు ఇష్టమైన ప్రోగ్రామ్‌లను స్టోర్ చేసి 72 గంటల్లోపు మళ్లీ చూడవచ్చు.
మస్క్ మామ తీసుకొచ్చిన యాప్ స్టార్ట్ ఓవర్ టీవీ అనే సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు ఏ షో లేదా సినిమా ప్రారంభమైనా మిస్ లేకుండా చూసే అవకాశం ఉంది. పైగా ఉచిత DVR రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇది వినియోగదారులకు ఏకంగా 100 గంటల ఫుటేజీని రికార్డ్ చేసుకునేందుకు వెసులుబాటును అందిస్తోంది. అయితే ఈ X TV యాప్‌ని ఉపయోగించాలనుకునే వారు తప్పనిసరిగా X సైట్ పేజీలో ఖాతాను కలిగి ఉండాల్సి ఉంటుంది. యాప్ వినియోగానికి సంబంధించిన పూర్తి చెల్లింపు వివరాలు త్వరలోనే మస్క్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications