Twitter: ఇప్పటి వరకు బిలియనీర్ ఎలాన్ మస్క్ కారణం లేకుండా ఉద్యోగుల తొలగింపులకు పూనుకున్నారని అందరూ భావించారు. అయితే తాను తప్పని పరిస్థితుల్లోనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తాజాగా వెల్లడించారు. రోజూ మిలియన్ డాలర్లలో నష్టపోతున్నట్లు లెక్కలతో సహా చెప్పుకొచ్చారు.
తగ్గిన ట్విట్టర్ ఆదాయం..
తాజాగా ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికెషన్ నెలవారీ ఛార్జీలను 8 డాలర్లకు పెంచిన ఎలాన్ మస్క్.. ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులను ఎంచుకున్నారు. అయితే తాను ఈ నిర్ణయం తీసుకోవటానికి అమెరికాలోని యాక్టివిస్ట్ గ్రూపులు కారణమని ఆరోపించారు.

తగ్గిపోయిన ప్రకటనలు..
ట్విట్టర్ కు యాడ్స్ తగ్గటం వల్ల భారీగా ఆదాయానికి గండి పడింది. అమెరికాలో ప్రకటనలు ఇచ్చేవారిపై యాక్టివిస్ట్ గ్రూప్స్ ఒత్తిడి చేస్తున్నాయని ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Twitterలో నెలకు సగటు కొత్త ప్రకటనదారుల సంఖ్య జూలైకి ముందు 1,000గా ఉండేది. అయితే జూలై-ఆగస్టు మధ్య కాలంలో ఈ సంఖ్య 200కి పడిపోయింది. ఇది కంపెనీ ఆదాయంపై భారీ ప్రభావాన్ని చూపిందని మస్క్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛను హరించేందుకు..
అమెరికాలో మాట్లాడే స్వేచ్ఛను హరించేందుకు యాక్టివిస్ట్ గ్రూప్స్ ప్రయత్నిస్తున్నాయని మస్క్ మండిపడ్డారు. టెక్ క్రంచ్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనరల్ మోటార్స్, ఆడి, ఫైజర్‌తో సహా అనేక బ్రాండ్‌లు ట్విట్టర్ ప్రకటనలపై ఖర్చు చేయడం నిలిపివేశాయి. దీంతో కంపెనీ ప్రతిరోజూ 4 మిలియన్ డార్లను కోల్పోతోందని వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో వేరే గచ్ఛంతరం లేకనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నానని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.

మస్క్ రాకతో..
ఎలాన్ మస్క్ రాకతో ట్విట్టర్ స్వరూపం పూర్తిగా మారిపోతోంది. ట్విట్టర్ లో విద్వేషపూరిత, తప్పుడు సమాచారం వృద్ధి చెందుతుందనే ఆందోళనలతో ప్రకటనదారులు ప్లాట్‌ఫారమ్ నుంచి పారిపోతున్నారు. ఈ తరుణంలో ట్విట్టర్ తన ప్రపంచ శ్రామికశక్తిలో 50% మందిని తొలగించినట్లు శుక్రవారం కంపెనీ సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ చీఫ్ యోయెల్ రోత్ వెల్లడించారు. దీనిలో భాగంగా ఇండియాలోని ఉద్యోగులు సైతం జాబ్స్ కోల్పోయారు.

జో బైడెన్ స్పందన..
అమెరికాలోని చికాగోలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై స్పందించారు. ట్విట్టర్ అబద్ధాలను పంచుతుందని బైడెన్ నిందించారు. అసత్యాలను ఊదరగొడుతుందని ఆరోపించారు. ప్రపంచ కుబేరుడు అబద్ధాలను ప్రపంచవ్యాప్తంగా పంచే సంస్థను కొనుగోలు చేశారని అన్నారు. ఇప్పుడు ప్రజలందరూ దీనిగురించే చింతిస్తున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications