టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ బ్యాన్ అంశంపై స్పందించారు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే ట్రంప్ సోషల్ మీడియా ఖాతాను పునరుద్ధరిస్తామని మస్క్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను వశం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయం తెలిసినప్పటి నుండే ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తారని ప్రచారం సాగింది. ఇందుకు అనుగుణంగా మస్క్ తాజాగా స్పందించారు.
ట్వీట్ల తొలగింపు, ఖాతాలను శాశ్వతంగా నిషేధించే విషయంలో ట్విట్టర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గతంలో ఎలాన్ మస్క్ అన్నారు. 2021లో క్యాపిటల్ హిల్ పైన దాడి సందర్భంగా ట్రంప్ ఖాతా పైన ట్విట్టర్ పర్మినెంట్ నిషేధం విధించింది. దీనిపై మస్క్ తాజాగా స్పందించారు. పూర్తి నిషేధం తప్పిదమన్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

తమ ఇద్దరి ఆలోచన ప్రకారం శాశ్వత నిషేధం సరికాదని మస్క్ అన్నారు. ఆ తర్వాత జాక్ డోర్సే కూడా స్పందించారు. ఎలాన్ మస్క్ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినా అందులో చేరే ప్రసక్తి లేదని ట్రంప్ ఇటీవల తేల్చి చెప్పారు. తాను ప్రారంభించిన టూత్ సోషల్ పైన దృష్టి సారిస్తానన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications