టెస్లాను తక్కువ ధరకే ఆపిల్‌కు అమ్మేద్దామనుకుంటే: ఎలాన్ మస్క్ షాకింగ్ న్యూస్
టెస్లా మోడల్ 3 తయారీ సమయంలో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో దీనిని ఇప్పుడున్న మార్కెట్ వ్యాల్యూలో పదవ వంతుకు ఆపిల్‌కు విక్రయించాలని భావించినట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. 2017లో ఇది జరిగిందని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వెల్లడించారు. మోడల్ 3 ఎలక్ట్రికల్ కార్లతో ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు టెస్లా ఇంక్ దూసుకెళ్తోంది. కానీ కొన్నేళ్ల క్రితం ఇబ్బందులు ఎదుర్కోవడం గమనార్హం.

ఎలాన్ మస్క్ ట్వీట్
మోడల్ 3 అభివృద్ధి సమయంలో తీవ్రమైన కష్టాల్లో ఉన్నాం. అప్పుడు టెస్లాను ఇప్పుడున్న ధరలో పదోవంతుకు విక్రయించాలని ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తో డీల్ కుదుర్చుకోవాలని భావించాను. కానీ ఆయన ఆ భేటీకి నిరాకరించారు.' అని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం అంటే 2017లో టెస్లా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఓ దశలో దివాలా దశకు చేరుకుంది. అయితే ఆ తర్వాత టెస్లా పుంజుకుంది. ఈ మూడేళ్లలో దాదాపు 1400 శాతం పెరిగింది. ఈ ఏడాదిలోనే 700 శాతం జంప్ చేసింది. ఎలాన్ మస్క్ కూడా ఈ ఏడాది కుబేరుల జాబితాలో ఏకంగా రెండో స్థానానికి వచ్చారు. ఎస్ అండ్ పీ 500 సూచీలో స్థానం దక్కించుకున్న మరుసటి రోజు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. మూడేళ్ల క్రితం పదోవంతుకు విక్రయం అంటే 60 బిలియన్ డాలర్లు.

అప్పుడు టెస్లా వ్యాల్యూ 100 బిలియన్ డాలర్లు
టిమ్ కుక్‌ను సంప్రదించిన విషయాన్ని ఈ డీల్‌తో సంబంధం ఉన్న వ్యక్తి ధృవీకరించారని ఆంగ్ల మీడియా పేర్కొంది. వాస్తవానికి అప్పట్లో టెస్లా వ్యాల్యూ 100 బిలియన్ డాలర్లు. ఆపిల్ కూడా 2014 నుండి ప్రాజెక్టు టైటాన్ పేరుతో కారును అభివృద్ధి చేస్తోంది. 2018 నాటికి ఆపిల్ 45 అటానమస్ కార్లను తయారు చేసినట్లు కాలిఫోర్నియా డిపార్టుమెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్ తెలిపింది.

టెస్లా ఇంక్‌కు పోటీగా..
మూడేళ్ల క్రితం టెస్లా ఇంక్‌కు పూర్తిస్థాయి పోటీదారులుగా నిలవాలన్న ప్రణాళికల నుండి ఐఫోన్ల దిగ్గజం ఆపిల్ ఇంక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీ వైపు దృష్టి సారించింది. గతంలో టెస్లా కంపెనీలో పని చేసిన పలువురిని ప్రాజెక్టు టైటాన్‌లో ఇటీవల ఉద్యోగులుగా ఆపిల్ చేర్చుకుంది. డ్రైవ్ టెరైన్, కార్ ఇంటీరియల్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించుకుంది. అలాగే, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలను కూడా కొనుగోలు చేసింది. 2024 వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికను ఆవిష్కరించింది.


Click it and Unblock the Notifications