Elon Musk: తీవ్ర మాంద్యం తప్పదంటూ ఎలాన్ మస్క్ హెచ్చరిక.. ఫెడరల్ రిజర్వ్ పై విమర్శలు
Elon Musk: అగ్రరాజ్యం అమెరికాలో వరుస బ్యాంకుల సంక్షోభం ప్రపంచాన్ని మరింత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు ఆయా దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి లేఆఫ్ లు అంటూ ఉద్యోగులను తొలగిస్తూ మాంద్యం సంకేతాలు పంపించాయి. కానీ ఇప్పుడు దాని కంటే ముందు అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోను కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆర్థిక మాంద్యం గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. US ఫెడరల్ రిజర్వ్ మరింతగా వడ్డీ రేట్లు పెంచుతుండటం తీవ్రమైన మాంద్యంను ప్రేరేపిస్తుందన్నారు. అందుకు సంకేతాలు సైతం కనిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. దీనిపై US ట్రెజరీ మాజీ సెక్రటరీ లారెన్స్ సమ్మర్ చేసిన స్పందించారు.

ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఫెడ్ ఇదే చర్యలను కొనసాగిస్తే, మందగమనం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోపు ఎప్పుడైనా ఈ పరిస్థితి ఎదుర్కోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు 70 శాతం ఛాన్స్ ఉందని వెల్లడించారు.
"ఫెడ్ డేటా చాలా వెనుకబడి ఉంది. తేలికపాటి మాంద్యం ఇప్పటికే కొనసాగుతోంది. ఇది కేవలం ఒక్క సిలికాన్ వ్యాలీ బ్యాంకు కుప్పకూలడంతో మాత్రమే ఆగిపోదు. పరిశ్రమ దిగ్గజం క్రెడిట్ సుస్సీ సైతం సంక్షోభంలోకి జారుకుంది. దేశ వ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మరిన్ని ఆర్థిక సంస్థలకు ముప్పు పొంచి ఉంది. ఇంకా రేట్లను పెంచడం తీవ్ర మాంద్యాన్ని ప్రేరేపిస్తుంది. నా మాటలను గుర్తుంచుకోంది" అని సమ్మర్ ట్వీట్ కు ప్రతిగా మస్క్ స్పందించారు.
ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన డేటా కాకుండా ఇప్పటికే ముగిసిన సమాచారాన్ని ఫెడ్ వినియోగించడం సరికాదని మస్క్ అభిప్రాయపడ్డారు. Huduser.gov వెబ్ సైట్ ప్రకారం.. అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వ నివేదికలు మరియు సమాచారానికి నెల తర్వాత రిలీజ్ చేయబడే జాతీయ ఉపాధి గణాంకాలు ప్రాథమిక మూలం.
రేట్ల పెంపును నిర్ణయించడానికి ఫెడ్ ఉపయోగించే లెక్కలు సైతం ఇదే తరహాలోనివి. అంటే మార్చి నుంచి వచ్చే డేటా ఆధారంగా మేలో వడ్డీ రేట్లను ఫెడ్ పెంచాలని నిర్ణయించుకుంటే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కంటే చాలా వెనుకబడి ఉన్నారని మస్క్ చెప్పినది నిజమే.


Click it and Unblock the Notifications