Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా దానికో అర్థం ఉంటుంది. ట్విట్టర్ కొనుగోలుతో లాభం లేదని అందరూ అనుకున్నప్పటికీ దానిని తన కొత్త వ్యాపార ఆలోచనకు మస్క్ ముడిపెడుతున్నారు.
అవును తన సోషన్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా యూజర్లు త్వరలోనే ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వెసులుబాటు తెస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్ సీఈవో లిండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. పేమెంట్ ఎక్స్ పేరుతో ఆర్థిక సేవల తర్వాత రానున్న రోజుల్లో ట్విట్టర్ ద్వారా వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చని తెలుస్తోంది. దీనికోసం ట్విట్టర్‌లో మరికొన్ని మార్పులు త్వరలో రానున్నాయని కూడా సీఈవో సూచించారు.

ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ లేదా X హ్యాండిల్‌ని ఉపయోగించేందుకు కస్టమర్‌లకు ఛార్జీ విధించాలని ఆలోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. యాప్‌ను ఉపయోగించేందుకు వినియోగదారుడు నెలవారీ రుసుముగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో మస్క్ ఈ విషయాన్ని తెలిపారు. స్మామ్ ఖాతాలను తగ్గించేందుకు ఇది కొంత దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది 44 బిలియన్ డాలర్ల భారీ డీల్‌లో ట్విట్టర్‌ని మస్క్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దానిలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలు కోతల నుంచి ఆఫీసులను ఖాళీ చేయటం వరకు చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత గతంలో నిషేధించబడిన ఖాతాలను మళ్లీ యాక్టివేట్ చేయడానికి మస్క్ అనుమతించాడు. ఈ చర్యతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా మళ్లీ తెరుచుకుంది. బ్లూ టిక్ వెరిఫికేషన్ సిస్టమ్‌లో కూడా మార్పులు చేస్తోంది. తాజాగా సేవలకు అంతరాయాలు ఏర్పడినట్లు ట్విట్టర్ డౌన్ అయినట్లు యూజర్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications