For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twitter: ట్విట్టర్ ఆఫీసు అద్దె కట్టని ఎలాన్ మస్క్.. ట్విట్టర్ 2.0కి సన్నాహాలు..

|

Twitter: ట్విట్టర్ కొనుగోలుతో ఎలాన్ మస్క్ జీవితం అత్యంత క్లిష్టంగా మారింది. చరిత్రలో ఎవ్వరూ చూడని, వినని రీతిలో ఏకంగా మస్క్ సంపద 200 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ట్విట్టర్ బాస్ గా మారిన మస్క్ కంపెనీని రోజురోజుకూ దిగజారే స్థితికి తెస్తున్నారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ లో సైతం పరిస్థితులు దయనీయంగా మారాయని తెలుస్తోంది.

ఖర్చులు తగ్గింపు..

ఖర్చులు తగ్గింపు..

ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విట్టర్ ప్రకటన ఆదాయం తగ్గటంతో ఖర్చులను మదించే పనిలో భాగంగా చాలా నిర్ణయాలు తీసుకుంది. ట్విట్టర్ బాస్ ఉద్యోగులకు అనేక సౌకర్యాలను నిలిపివేసారు, సెక్యూరిటీని కూడా తొలగించారు. దీనికి తోడు కంపెనీలోని ఫర్నీచర్, కిచెన్ అప్లయెన్సెస్, ఇంకా మరెన్నో అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనికి ముందు కంపెనీని చేజిక్కించుకోగానే దాదాపు 50 శాతం మంది ఉద్యోగులను కూడా తొలగించాడు.

 ఆఫీసు అద్దె కట్టలేక..

ఆఫీసు అద్దె కట్టలేక..

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని పూర్తిగా రద్దు చేసిన ఎలాన్ మస్క్.. వారికి అందిస్తున్న ఉచిత భోజనాన్ని సైతం నిలిపివేశాడు. ఈ క్రమంలో మస్క్ ఆఫీసు అద్దె సైతం చెల్లించలేదని తెలుస్తోంది. ట్విట్టర్ ఇప్పటి వరకు రూ.1.12 కోట్ల కంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సి ఉందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ట్విట్టర్ 2.0..

ట్విట్టర్ 2.0..

కంపెనీని పూర్తి స్థాయిలో మార్చేందుకు తాను వారంలో ఏడు రోజులు 24*7 పనిచేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అయితే ట్విట్టర్ 2.0ను నిర్శించేందుకు తాను ఇంజనీర్లతో కలిసి పనిచేస్తున్నట్లు మస్క్ వెల్లడించాడు. సెలవు దినాలతో సంబంధం లేకుండా ఉద్యోగులు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలని ట్విట్టర్ బాస్ భావిస్తున్నారు.

వాష్‌రూమ్‌ కడిగేవారు..

వాష్‌రూమ్‌ కడిగేవారు..

కార్యాలయాన్ని శుభ్రపరిచే వారిని సైతం ఎలాన్ మస్క్ తొలగించారు. ఈ క్రమంలో ఉద్యోగులు తమ టాయిలెట్ పేపర్‌ను సొంతంగా తీసుకురావాలని పేర్కొంది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో వాష్‌రూమ్‌లను ఎవరూ శుభ్రం చేయడం లేదని వార్తలు వెల్లువెత్తాయి. ఇవన్నీ చూస్తుంటే మస్క్, ట్విట్టర్ రెండూ గడ్డు కాలాన్ని అనుభవిస్తున్నాయి.

English summary

Twitter: ట్విట్టర్ ఆఫీసు అద్దె కట్టని ఎలాన్ మస్క్.. ట్విట్టర్ 2.0కి సన్నాహాలు.. | Elon musk owned Twitter failed to pay office rent and no one to clean wash rooms

Elon musk owned Twitter failed to pay office rent and no one to clean wash rooms
Story first published: Tuesday, January 3, 2023, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X