సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారీ ఆఫర్ ఇచ్చారు. ఇటీవల వాటాల కొనుగోలుతో వాటాదారుగా మారిన మస్క్ ఏకంగా కంపెనీ కొనుగోలుకు ముందుకు వచ్చారు. కంపెనీకి చెందిన ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కంపెనీకి చెందిన ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు.
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం 41 బిలియన్ డాలర్లతో మిగిలిన షేర్లు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్ వ్యాల్యూతో పోలిస్తే ఇది 38 శాతం అధికం. ఎలాన్ మస్క్ ఆఫర్‌తో ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు పరుగు పెట్టాయి.

ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించే వేదికగా మారిందనే ఉద్దేశ్యంతో ట్విట్టర్‌లో ఇటీవల పెట్టుబడులు పెట్టానని, కానీ ప్రస్తుత తరహాలో పని చేయడం వల్ల అది సాధ్యం కాదని, అందుకే ఓ ప్రయివేటు కంపెనీ తరహాలో ట్విట్టర్ పని చేయాల్సి ఉందని, ఇందుకు కొన్ని మార్పులు అవసరమన్నారు. ఈ మేరకు ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్‌కు లేఖ రాశారు. ఇది బెస్ట్ ఆఫర్ అలాగే ఫైనల్ ఆఫర్ అని చెప్పారు. తన వాటాను ఆమోదించని పక్షంలో వాటా విషయంలో పునరాలోచన చేయాల్సి ఉంటుందన్నారు. ట్విట్టర్‌లో మస్క్ 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications