ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ (Elon musk) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన వ్యాపారాల వల్ల కాకుండా, సంతోషం , డబ్బు గురించి చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. సుమారు 852 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 71 లక్షల కోట్లు) ఆస్తితో ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ స్థాయికి చేరిన వ్యక్తిగా చరిత్ర సృష్టించిన కొద్ది రోజులకే ఆయన ఈ పోస్ట్ చేయడం విశేషం.

మస్క్ ఏమన్నారంటే?
ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'లో ఒక పాత సామెతను గుర్తు చేస్తూ.. "డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని ఎవరు అన్నారో కానీ వారు చెప్పింది అక్షరాలా నిజం" అని రాశారు. దీనికి చివరలో ఒక విచారంగా ఉన్న ఎమోజీని కూడా జత చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి నుండి ఇలాంటి మాటలు రావడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది.
నెటిజన్ల రియాక్షన్లు
మస్క్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జోకులు పేలుస్తుండగా.. మరికొందరు జీవిత సత్యాలను వివరిస్తున్నారు. ఒక యూజర్ ఫన్నీగా స్పందిస్తూ.. "సార్, నాకు ఒక 1 మిలియన్ డాలర్లు పంపండి.. అప్పుడు మీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. అది నిజమో కాదో నేనే చెప్తా" అని సరదాగా కామెంట్ చేశారు. మరొక నెటిజన్.. "అద్దె కట్టాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి వేదాంతం మాట్లాడటం చాలా ఈజీ" అని ఎద్దేవా చేశారు.
ఇకపోతే మరొక నెటిజన్.. "డబ్బు సంతోషాన్ని గ్యారెంటీ ఇవ్వకపోవచ్చు. కానీ, డబ్బు లేకపోతే వచ్చే ఒత్తిడి మాత్రం నరకం చూపిస్తుంది. తిండి, గూడు కోసం చింత లేనప్పుడే అసలైన ప్రశాంతత దొరుకుతుంది" అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
852 బిలియన్ డాలర్ల సంపద ఎలా వచ్చింది?
ఎలన్ మస్క్ (Elon musk) నెట్ వర్త్ ఒక్కసారిగా పెరగడానికి కారణం ఆయన తీసుకున్న ఒక భారీ వ్యాపార నిర్ణయం. మస్క్ తన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ (SpaceX) ద్వారా తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'xAI' ని కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ సుమారు 1.25 ట్రిలియన్ డాలర్లు. ఈ విలీనం వల్ల మస్క్ వ్యక్తిగత ఆస్తి ఒకేసారి 84 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 852 బిలియన్ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. చరిత్రలో ఇంతటి సంపద కలిగిన ఏకైక వ్యక్తి ఎలన్ మస్క్ మాత్రమే.
డబ్బు వర్సెస్ సంతోషం
ఏది ఏమైనా మస్క్ కామెంట్స్ సీరియస్ గా చేసినవో లేదా సరదాగా చేసినవో తెలియదు. ఎంత సంపాదించినా మనిషికి మనశ్శాంతి, సంతోషం అనేవి భౌతిక వస్తువుల ద్వారా లభించవని మస్క్ మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే సాధారణ ప్రజలకు మాత్రం కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అనేది ఎంతో ముఖ్యం. ప్రపంచ కుబేరుడైనా, సామాన్యుడైనా సంతోషం కోసం వెతుకులాట మాత్రం తప్పదని అర్థమవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications