ప్రపంచ టెక్ దిగ్గజం.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) మరోసారి చరిత్ర సృష్టించారు. అసాధ్యం అనుకున్న మైలురాయిని సుసాధ్యం చేస్తూ.. ప్రపంచంలోనే 700 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఒకప్పుడు సంపన్న దేశాల బడ్జెట్ కంటే మస్క్ సంపదే ఎక్కువగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఈ భారీ సంపద వెనుక ఉన్న ఓ పెద్ద కోర్టు పోరాటం ఉంది. అదేంటి? మస్క్ అందులో ఎలా విజయం సాధించారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సంపద అమాంతం పెరగడానికి కారణం ఏంటి?
మొన్నటి వరకు ఎలన్ మస్క్ (Elon Musk) సంపద పెరుగుతూ ఉన్నా.. ఇప్పుడు సడెన్ గా జంప్ అవ్వడానికి ప్రధాన కారణం 'టెస్లా' పారితోషికం ప్యాకేజీ. దీనిపై తాజాగా వచ్చిన కోర్టు తీర్పు కారణంగా మస్క్ ఇప్పుడు బిగ్గెస్ట్ బిలియనీర్ గా మారాడు.
2018లో టెస్లా బోర్డ్ మస్క్ కు భారీ పారితోషికాన్ని (సుమారు 56 బిలియన్ డాలర్లు) ఆఫర్ చేసింది. అయితే ఒక షేర్ హోల్డర్ దీనిపై కోర్టుకు వెళ్లి, ఈ ప్యాకేజీ చెల్లదని వాదించారు. కింది కోర్టు కూడా మస్క్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. తాజాగా డెలావేర్ సుప్రీం కోర్టు మస్క్ కు అనుకూలంగా తీర్పునిస్తూ, పాత తీర్పును పక్కన పెట్టేసింది. ఈ ఒక్క నిర్ణయంతో మస్క్ నికర సంపద ఒక్క సారిగా 749 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
మస్క్ దరికి చేరని ఇతర బిలియనీర్లు!
ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ (Elon Musk) కు , మిగతా వారికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ప్రస్తుతానికి మస్క్ నికర సంపద 749 బిలియన్ డాలర్లు అయితే రెండో స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద 500 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే మస్క్ తన తర్వాతి స్థానంలో ఉన్న వ్యక్తి కంటే దాదాపు 249 బిలియన్ డాలర్ల ముందంజలో ఉన్నారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ లక్ష్యాలను అందుకుంటే మస్క్ పారితోషికం ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ట్రిలియన్ డాలర్ల టార్గెట్!
టెస్లా బోర్డు మస్క్ పనితీరును బట్టి గరిష్ఠంగా ట్రిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఇది దక్కాలంటే.. టెస్లా సంస్థ ఏఐ (AI) రంగంలో అద్భుతాలు చేయాలి. అలాగే హ్యూమనాయిడ్ రోబోటిక్స్ , మార్కెట్ వృద్ధిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి.
ఏదేమైనా మస్క్ తన సొంత మేధస్సుతో సంస్థను ఈ స్థాయికి చేర్చారు కాబట్టే, ఇన్వెస్టర్లు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఒక సాధారణ టెక్ ఆంత్రప్రెన్యూర్ నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యక్తిగా ఎదిగిన మస్క్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ట్రంప్ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన సంపద ఏ స్థాయికి చేరుతుందో ఊహించడం కూడా కష్టమే!
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications