Elon Musk: అపర కుబేరుడు, టెస్లా మరియు X అధినేత ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. కేవలం తన వ్యాపార కార్యకలాపాలే కాకుండా వ్యక్తిగత విషయాలు సైతం ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పటికే తన పిల్లలకు విచిత్రమైన పేర్లు పెట్టగా.. తాజాగా మరో కుమారుడికి అదే రీతిలో నామకరణం చేశారు.
ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ చంద్రశేఖర్ కు విభిన్న రీతిలో ఎలాన్ మస్క్ నివాళులర్పించారు. ఆయన గౌరవార్థం తన కుమారుడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టినట్లు ఈ కుబేరుడు వివరించాడు. బ్రిటన్ లో జరుగుతున్న గ్లోబల్ AI సమ్మిట్ లో ఈ విషయం వెల్లడించారు.

నక్షత్రాల నిర్మాణం, పరిణామంపై ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేసిన కృషికి గాను 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆయనకు నివాళిగా తన కుమారుడిని ప్రేమగా శేఖర్ అని పిలుస్తామని మస్క్ భార్య శివన్ జిలిస్ తెలిపారు. ఆమె కెనడియన్ వెంచర్ క్యాపిటలిస్ట్ కాగా టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి.
AI ప్రస్తుత స్థితి, భద్రతతో పాటు భవిష్యత్తు గురించి చర్చించేందుకు పాలసీ మేకర్స్, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. అయితే ఎలాన్ మస్క్ తన కుమారుడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టడం.. శాస్త్రీయ మరియు సాంస్కృతిక వారసత్వం రెండింటినీ గౌరవించే ఒక అద్భుతమైన ఘట్టమని పలువురు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications