రెండు రోజుల్లో 50 బిలియన్ డాలర్లు కోల్పోయిన ఎలాన్ మస్క్
టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ రెండు రోజుల్లోనే 50 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చరిత్రలో అతిపెద్ద రెండు రోజుల పతనం ఇది. గతంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఒక్కరోజులో 36 బిలియన్ డాలర్లు కోల్పోయారు. అప్పుడు బెజోస్ డైవోర్స్ వార్త నేపథ్యంలో అమెజాన్ స్టాక్స్ పతనమయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎలాన్ మస్క్ సంపద 50 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఇందుకు ఆయన ఇటీవల చేసిన ట్వీట్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. పన్ను చెల్లింపు కోసం 10 శాతం షేర్లు విక్రయించాలా, వద్దా అనే అంశంపై ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా నెటిజన్లను ప్రశ్నించారు. ఇందులో ఎక్కువమంది నెటిజన్లు షేర్ల విక్రయానికి ఓటు వేశారు. అంతకంటే ముందే అంటే పోల్ నిర్వహణకు ముందే ఎలాన్ మస్క్ సోదరుడు కింబల్ టెస్లాలోని వాటాలను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో షేర్ ధర రెండు రోజుల పాటు భారీగా పడిపోయింది.
షేర్ ధర ఇంత పతనమైనప్పటికీ ఈ ఏడాది మస్క్ సంపద వృద్ధి 70 శాతం వరకు ఉంది. టెస్లా ఆదాయాల్లో బలమైన వృద్ధి, కార్ల డెలివరీలు పెరగడం, స్పేస్ ఎక్స్‌కు అత్యధిక విలువ లభించడం దీనికి ప్రధాన కారణాలు. టెస్లా మార్కెట్ విలువ ఈ ఏడాది ట్రలియన్ డాలర్లను క్రాస్ చేసింది.

ది బిగ్ షార్ట్ చిత్రం ద్వారా పేరు ప్రఖ్యాతలు గాంచిన పెట్టుబడిదారు మైఖేల్ బరీ కూడా మస్క్ తన రుణాలు లేదా పన్నులు తీర్చడానికి షేర్లను విక్రయించుకోవచ్చునని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆదాయంపరంగా జెఫ్ బెజోస్‌తో పోలిస్తే మస్క్ ఆదాయం 83 బిలియన్ డాలర్లు తగ్గించింది. ఎలాన్ మస్క్ జనవరి నెలలో మొదటిసారి జెఫ్ బెజోస్‌ను అధిగమించారు. టెస్లాలో షేర్లు కలిగిన కాథీ వుడ్స్ ఆర్క్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ మంగళవారం నాటి అమ్మకాలలో 750 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. కంపెనీ రెండో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు ఒరాకిల్ కార్ప్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ 2.1 బిలియన్ డాలర్లను కోల్పోయారు.


Click it and Unblock the Notifications