టెస్లా ఇంక్ సీఈవో ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది భారీగా ఎగిసిపడిన విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా ఆయన ఆస్తి కరిగిపోయింది. 2020లో భారీగా పోగేసిన సంపదలో ఎక్కువ శాతం ఈ వారంలో నష్టపోయారు. సోమవారం నుండి నిన్నటి శుక్రవారం వరకు ఆయన ఏకంగా 27 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 156.9 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపదతో పోలిస్తే ఎలాన్ మస్క్ ఆదాయం 20 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది. కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నాయి. దీంతో గత 4 వారాల్లో ఎలాన్ మస్క్ సంపద అంతకంతకూ క్షీణించింది. టెస్లా స్టాక్స్ వ్యాల్యూ కూడా ఈ సమయంలో 230 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఒక్క వారంలోనే సంస్థ షేర్ల విలువ 11 శాతం పడిపోయింది.

18 నెలల కాలంలో ఇది అత్యంత దారుణ పతనం. అంటే 2019 మే అనంతరం ఈ స్థాయిలో పతనం కావడం ఇది మొదటిసారి. అమెరికాలో బాండ్స్ మార్కెట్ల వల్ల నెలకొన్న ప్రతికూలతలే టెస్లా స్టాక్ పతనానికి కారణం అయింది. కంపెనీ మార్కెట్ వ్యాల్యూ జనవరిలో 837 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 574 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2020లో కంపెనీ షేర్ల విలువ 743 శాతం ఎగిసిపడింది. కొత్త ఏడాదిలోను ప్రారంభంలో అదే జోరు కనిపించింది. జెఫ్ బెజోస్‌ను కూడా దాటి వేసిన సందర్భం ఉంది. మార్కెట్ల ప్రతికూలతలతో ఆ స్థానంలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఇటీవల టెస్లా పెట్టుబడులు పెట్టిన బిట్ కాయిన్ వ్యాల్యూ కూడా పడిపోయింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications