For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ, అమెరికాతో మనోళ్లు పోటీ

|

కరోనా మహమ్మారి సమయంలోను 40 మంది భారతీయులు బిలియనీర్ల జాబితాలోకి చేరారు. దీంతో బిలియనీర్ కుబేరుల సంఖ్య 177కు పెరిగింది. భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 83 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానంలోకి ఎగబాకారు. గత ఏడాది ఆయన సంపద 24 శాతం పెరిగింది. మన కరెన్సీలో రూ.6.09 లక్షల కోట్లకు చేరుకుంది. హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ మంగళవారం విడుదలైంది. దీని ప్రకారం ముఖేష్ అంబానీ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలి స్థానంలో ఉన్నారు.

హురున్ జాబితాలో వీరు..

హురున్ జాబితాలో వీరు..

హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో 32 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ, ఫ్యామిలీ 48వ స్థానంలో, రూ.1.94 లక్షల కోట్లతో శివనాడార్, ఫ్యామిలీ 58వ స్థానంలో, రూ.1.40 లక్షల కోట్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్ 104వ స్థానంలో, సీరం ఇనిస్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా 113వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ ఏకంగా 20 స్థానాలు ఎగబాకారు. భారత్‌లో విదేశాల్లో కలిపి హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో 209మంది భారతీయులు ఉన్నారు. ఇందులో 177మంది భారత్‌లో నివసిస్తున్నారు. భారత్‌లో నివసించే 177 మందిలో 40 మంది, మొత్తంగా భారతీయులు 209 మందిలో 50 మంది ఈ జాబితాలో చేరారు.

అమెరికాతో పోటీపడిన భారత్

అమెరికాతో పోటీపడిన భారత్

గత సంవత్సరం కొత్తగా పుట్టుకు వచ్చిన బిలియనీర్లకు సంబంధించి అమెరికాతో భారత్ పోటీ పడింది. అమెరికాలో 69 మంది కొత్తగా బిలియనీర్ల పుట్టుకు రాగా, భారత్ నుండి ఆ సంఖ్య 50గా ఉంది. ఐటీ సేవల కంపెనీ స్కేలార్ సీఈవో జేచౌదరి సంపద 271 శాతం ఎగిసి 13 బిలియన్ డాలర్లకు, అదానీ గ్రూప్‌కు చెందిన వినోద్ శాంతిలాల్ అదానీ సంపద 128 శాతం పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బైజూస్ రవీంద్రన్, కుటుంబం ఆదాయం 100 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్లకు, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, కుటుంబం ఆదాయం 100 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే పతంజలి ఆయుర్వేదిక్ ఆచార్య బాలకృష్ణన్ సంపద 32 శాతం తగ్గి 3.6 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. చేతిలో డబ్బులు లేని పరిస్థితి. కానీ కుబేరులు మాత్రం మరింత కుబేరులయ్యారు.

సెల్ఫ్ మెడ్ బిలియనీర్లు

సెల్ఫ్ మెడ్ బిలియనీర్లు

బయోకాన్ కిరణ్ మజుందర్ షా ఆధాయం 41 శాతం పెరిగి 4.8 బిలియన్ డాలర్లకు, గోద్రెజ్‌కు చెందిన స్మితా వీ క్రిష్ణ సంపద 4.7 బిలియన్ డాలర్లకు, లుపిన్ మంజు గుప్తా ఆదాయం 3.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తం కుబేరుల్లో 118 మంది సెల్ఫ్ మేడ్ ఉండగా, డ్రాగన్ దేశం చైనా నుండి 1058 కుబేరులకు గాను 932 మంది సెల్ఫ్ మేడ్ ఉన్నారు.

ఇక, అంతర్జాతీయంగా చూస్తే 197 బిలియన్ డాలర్లతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 1వ స్థానంలో, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్లతో రెడో స్థానంలో, ఫ్రెంచ్ మెన్ బెర్నార్డ్ అర్నాల్ట్ 114 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

English summary

ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ, అమెరికాతో మనోళ్లు పోటీ | Elon Musk, Jeff Bezos and Mukesh Ambani are among the top 10 richest people in the world

Tesla CEO Elon Musk is the richest person in the world, followed by Amazon's Jeff Bezos at the second position. Reliance Industries' Mukesh Ambani is the richest Indian and is ranked eighth globally.
Story first published: Tuesday, March 2, 2021, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X