జెఫ్ బెజోస్ కంటే ఎలాన్ మస్క్ సంపద ఎక్కువ, సౌతాఫ్రికా జీడీపీ కంటే...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద కంటే 100 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో మస్క్ సంపద 282 బిలియన్ డాలర్లు. ఇది మన కరెన్సీలో రూ.21.15 లక్షల కోట్లు. అదే సమయంలో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ సంపద 183.6 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.13.77 లక్షల కోట్లు. కరోనా సమయంలో ఎలాన్ మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. 2020 ప్రారంభంలో ఈయన సంపద వ్యాల్యూ 2260 కోట్ల డాలర్లు మాత్రమే. 2020లో ఆయన సంపద 11,000 కోట్ల డాలర్లు పెరిగింది.
ఫోర్బ్స్ చరిత్రలో ఇలాంటి రికార్డ్ ఇప్పటి వరకు నమోదు కాలేదు. 2020లో 11,000 కోట్ల డాలర్లు పెరిగిన మస్క్ సంపద, 2021లో ఎలాన్ మస్క్ సంపద 9,000 కోట్ల డాలర్లు పెరిగింది. ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్డ్ సంపద 16,740 కోట్లు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సంపద 13,420 కోట్ల డాలర్లు కాగా, స్టీవ్ బాల్మర్ సంపద 9700 కోట్ల డాలర్లు. వీరు వరుసగా ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఏప్రిల్ 2012లో ఎలాన్ మస్క్ తన సంపదలో ఎక్కువ మొత్తాన్ని సమాజంలోని అత్యధికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల కోసం డొనేట్ చేయనున్నట్లు తెలిపారు. అతను 32 నేషనల్ ఫుట్ బాల్ లీగ్ టీమ్స్‌ను కొనుగోలు చేశాడు. వీటి వ్యాల్యూ 112 బిలియన్ డాలర్లు. మరో 61 బిలియన్ డాలర్లతో మరో 30 NBAలు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాన్ మస్క్ సొంత దేశం సౌతాఫ్రికా. ఈ దేశం జీడీపీ కంటే మస్క్ ఆదాయం కేవలం 35 బిలియన్ డాలర్లు మాత్రమే తక్కువ. వరల్డ్ బ్యాంకు ప్రకారం ఈ దేశ మొత్తం జీడీపీ 335 బిలియన్ డాలర్లు.


Click it and Unblock the Notifications