For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధం ఎత్తివేయాలా..? పోల్ నిర్వహించిన ఎలోన్ మస్క్.. ఫలితమేమిటంటే..

|

డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేయాలా వద్దా అనే దానిపై తాను ఇంకా నిర్ణయించుకోలేదనిఎలోన్ మస్క్ చెప్పారు. ట్రంప్ పై నిషేధం ఎత్తివేయడంపై ఆయన ఓటింగ్ నిర్వహించారు. మాజీ అధ్యక్షుడిని ప్లాట్‌ఫారమ్‌లో తిరిగి ఉంచడంపై ఓటు వేయమని వినియోగదారులను కోరారు. "మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌ను పునరుద్ధరించండి" అని బిలియనీర్ ట్విట్టర్ యజమాని పోస్ట్ చేశారు. అవును లేదా కాదు అని ఓటు వేసే అవకాశం ఉందన్నారు.

50లక్షల మందికి పైగా
ఇప్పటివరకు ఈ పోలింగ్‌లో 50లక్షల మందికి పైగా పాల్గొనగా.. దాదాపు సగం మంది ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించేందుకు అనుకూలంగా ఓట్లేసినట్లు తెలుస్తోంది. 2021లో క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్‌ ఖాతాపై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించింది. మస్క్ అతను గతంలో ఇలాంటి పోల్‌లు నిర్వహించాడు. గతంలో మస్క్ తన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లాలో స్టాక్‌ను విక్రయించాలా అని గత సంవత్సరం అనుచరులను అడిగాడు. ఆ పోల్ తరువాత, అతను $1 బిలియన్ కంటే ఎక్కువ షేర్లను విక్రయించాడు.

Elon Musk, head of Twitter, conducted a poll on the lifting of the ban on former US President Donald Trump

విద్వేష పూరిత కంటెంట్‌
మరోవైవు కంటెంట్ మోడరేషన్ ప్రణాళికలను మస్క్ వెల్లడించారు. ట్విటర్‌ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది కానీ నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండదని స్పష్టం చేశారు. విద్వేష పూరిత కంటెంట్‌ ఉన్న పోస్టులను తాము ప్రోత్సహించమని తేల్చి చెప్పారు.
44 బిలియన్‌ డాలర్ల ట్విటర్‌ డీల్‌ తరువాత సంచలన నిర్ణయాలతో అటు ఉద్యోగులను, ఇటు టెక్‌ వర్గాలను గందరగోళానికి గురిచేస్తూ విమర్శలు పాలవు తున్నారు. అయినా మస్క్‌ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

English summary

Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధం ఎత్తివేయాలా..? పోల్ నిర్వహించిన ఎలోన్ మస్క్.. ఫలితమేమిటంటే.. | Elon Musk, head of Twitter, conducted a poll on the lifting of the ban on former US President Donald Trump

Elon Musk says he has not yet decided whether to lift his Twitter ban on Donald Trump. He held a vote on lifting the ban on Trump.
Story first published: Saturday, November 19, 2022, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X