టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ మరో వాగ్దానం చేశాడు. తన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ త్వరలో అంధులు చూసేందుకు, పక్షవాతానికి గురైన వ్యక్తిని నడవడానికి అనుమతించే పరికరాన్ని అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో పరికరం మానవ మెదడులో అమర్చడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. ఏఐని అధిగమించేలా మానవుల మేధస్సును సామర్ధ్యాలను పెంచడానికి దోహద పడుతుందని, అందుకే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.

బ్రెయిన్ కంప్యూటర్
బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ ప్రైజెస్ టెక్నాలజీ పరిజ్ఞానంపై కాలిఫోర్నియాలోని న్యూరాలింక్ ప్రధాన కార్యాలయంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. పక్షపాతం వచ్చిన వారి అవయవాలను కదిలించేలా చేసేందుకు వెన్నపూసలో అమర్చేందుకు వీలుగా చిప్, చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండింటిలో విజయం సాధిస్తామన్నారు.
రెస్పాన్సిబుల్ మెడిసిన్
ఇది అద్భుతంగా అనిపించినప్పటికీ, అనేక మంది నిపుణులు న్యూరాలింక్ ప్రయోగంలో తలెత్త పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రయోగాలు నాన్‌వాసివ్ పద్ధతులతో చేయాలని వారు సలహా ఇస్తున్నారు. ఇంతకుముందు, ఈ చిప్‌లను కోతులపై ప్రయోగించారని గుర్తు చేశారు. రెస్పాన్సిబుల్ మెడిసిన్ కోసం వైద్యుల కమిటీ ఉదహరిస్తూ, ప్రయోగాల ఫలితంగా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, మూర్ఛలు, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం, వారు చంపబడటానికి ముందు మానసిక ఆరోగ్యం క్షీణించిందని చెప్పింది.

పుర్రెలో
మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తో పాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన ప్రయోగాలు జరిపేందుకు ఆహార,ఔషద నియంత్రణ సంస్థకు సమర్పించేందుకు అన్నీ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయని, అలాగే ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిపిన చర్చలన్నీ సానుకూలంగా ఉన్నట్లు మస్క్ చెప్పారు.More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications