Who is Diego Pasini? ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది. 500 మందికి పైగా సిబ్బందిని ఒకేసారి తొలగించడం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తొలగింపుల తర్వాత కంపెనీలో మరో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. కేవలం 20 ఏళ్ల వయసు కలిగిన డియాగో పాసిని అనే యువకుడు ఇప్పుడు xAI డేటా అనోటేషన్ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు.
డేటా అనోటేషన్ టీమ్ అంటే ఏమిటి? Grok అనే xAI చాట్‌బాట్ మరింత తెలివిగా మారేందుకు అవసరమైన శిక్షణ పనిని ఈ బృందం చేస్తుంది.ఇంటర్నెట్ నుండి వచ్చే ముడి డేటాను సేకరించడంతో పాటుగా దానిని లేబుల్ చేయడం, వర్గీకరించడం,సరైన సందర్భంలోకి మార్చడం ఇలాంటి పనులన్నీ డేటా అనోటేషన్ టీమ్ నిర్వహిస్తుంది. ఇలా శిక్షణ ఇచ్చిన డేటా ఆధారంగా Grok అనే AI వ్యవస్థ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడం నేర్చుకుంటుంది.

డియాగో పాసిని ఎవరు? ఇక xAI డేటా అనోటేషన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న 20 ఏళ్ల డియాగో పాసిని 2023లో హైస్కూల్ పూర్తి చేశాడు. విచిత్రంగా అదే ఏడాది xAI ని మస్క్ స్థాపించడం జరిగింది. అతను అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ చదివాడు. ప్రస్తుతం చదువు కోసం లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ లో ఉన్నాడు. న్యూజెర్సీలోని ఖరీదైన పింగ్రీ స్కూల్ లో హైస్కూల్ విద్యను అభ్యసించాడు.ఇక్కడే అతను రోబోటిక్స్ టీమ్‌లో చురుకుగా పాల్గొన్నాడు.2022లో MITలో డ్రోన్లపై పరిశోధన ప్రదర్శించాడు. 2024లో Contrary అనే పెట్టుబడి సంస్థలో ఫెలో గా ఎంపికయ్యాడు. అక్కడ ఆయన రోబోటిక్స్, హార్డ్ టెక్ స్టార్టప్‌లపై ఆసక్తి చూపించాడు.
xAIలో ఎలా చేరాడు? సెప్టెంబర్ 2024లో ఈ టెక్నీషియన్ X (ట్విట్టర్)లో ఎలాన్ మస్క్‌కు మద్దతుగా పోస్టులు పెట్టిన తర్వాత, మస్క్ ఆయనను ఫాలో చేశారు.జనవరి 2025లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన xAI హ్యాకథాన్‌లో గెలిచిన తర్వాత ఆయనకు ఉద్యోగావకాశం లభించింది. అప్పటి నుంచి ఆయన పనితీరు మస్క్ దృష్టిలో పడింది. గత వారం తొలగింపుల ముందు, సీనియర్ లెవెల్ ఉద్యోగుల స్లాక్ అకౌంట్లు డీయాక్టివేట్ చేసిన తర్వాత, పాసిని డేటా అనోటేషన్ బృందానికి బాధ్యతలు స్వీకరించాడు.
ఆయన ముందుగా బృంద సభ్యులకు ఇకపై ఉద్యోగాల తొలగింపుల ప్రణాళికలు లేవని హామీ ఇచ్చాడు. కానీ కొద్ది రోజులకే మరో 100 మంది ఉద్యోగులను తొలగించారు.దీని తర్వాత ఆయన మిగిలిన సభ్యులతో సమావేశాలు నిర్వహించి, వారి పనిని వివరించాలని కోరాడు. అంతేకాదు, స్లాక్‌లో ఒక ప్రకటన చేసి..కంపెనీలో మీ భవిష్యత్తు, మీరు రాబోయే పరీక్షల్లో చూపించే పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు.ఇప్పుడు ఎలాన్ మస్క్ AI కంపెనీలో వందల మందిని నడిపిస్తున్నాడు.టెక్ ఇండస్ట్రీలో అనుభవజ్ఞులకే లభించని బాధ్యతలు, కేవలం 20 ఏళ్ల వయసులో పాసిని చేతిలోకి రావడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications