For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Elon Musk: ఐఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. మస్క్ మళ్లీ మాటమార్చేశాడు ఫ్రెండ్స్..!

|

Elon Musk: ఎలాన్ మస్క్ అంటేనే ట్విస్ట్ లకు మారుపేరు. ఈ ప్రపంచ కుబేరుడు బ్లూ టిక్ ఫీజును 8 డాలర్లకు పెంచటంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ఆ నిర్ణయాన్ని కొద్ది కాలం పాటు మస్క్ తాత్కాలికంగా వాయిదా వేశారు.

మాట మారింది..

మాట మారింది..

అయితే ఆపిల్ యూజర్లకు ఈ బ్లూ టిక్ ఛార్జీలు 11 డాలర్లకు పెంచాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నారు. ఇది నిజంగా ఐఫోన్ యూజర్లకు భారంగా మారే విషయమని చెప్పుకోక తప్పదు. ఈ అధిక ధర కేవలం ఐఫోన్ యాప్ స్టోర్ ద్వారా ట్విట్టర్ సేవలను వినియోగించుకునే వారికి మాత్రమేనని తెలుస్తోంది. వెబ్ సైట్ ద్వారా ట్విట్టర్ సేవలను వాడుకునే వారు మాత్రం 8 డాలర్లను చెల్లిస్తే సరిపోతుందట. దీనికి ముందు ఆపిల్ స్టోర్ నుంచి ట్విట్టర్ యాప్ తొలగిస్తామని బెదిరిస్తున్నట్లు మస్క్ ఆరోపణలు చేయటం.. తర్వాత టిమ్ కుక్ తో చర్చలు సఫలమయ్యాయని ట్వీట్ చేయటం జరిగింది.

ఎందుకీ నిర్ణయం..

ఆపిల్ సంస్థ తన యాప్ స్టోర్ ద్వారా మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదించే యాప్ డెవలపర్ల నుంచి అదనంగా 30 శాతం టాక్స్ వసూలు చేస్తోంది. అందుకే Spotify వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా iPhone వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. తాజాగా ఆదాయ లోటుతో ట్విట్టర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ట్విట్టర కొత్త బాస్ ఎలాన్ మస్క్ సైతం తగ్గుతున్న ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పరోక్షంగా ఆపిస్ సంస్థ నిర్ణయాల కారణంగా ట్విట్టర్ పెయిడ్ సేవలు ఆపిల్ యూజర్లకు భారంగా మారనున్నట్లు తెలుస్తోంది.

భారత్ లో ఛార్జీలు ఇలా..

భారత్ లో ఛార్జీలు ఇలా..

ఆపిల్ సీక్రెట్ గా 30 శాతం యాప్ యూజర్ ఛార్జీలను వసూలు చేయటం సరికాదంటూ ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిపై బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించటం చర్చనీయాంశంగా మారింది. అయితే మస్క్ తీసుకోబోతున్న ఛార్జీల పెంపు నిర్ణయం వల్ల భారతదేశంలోని యూజర్లు 11 డాలర్లకు గాను నెలకు ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ రుసుముగా దాదాపు రూ.904.26 చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక ఐఫోన్ యూజర్లకు ఛార్జీల మోత తప్పదని తెలుస్తోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఆపిల్ రెవెన్యూ షేరింగ్ గురించి 2008లోని బహిరంగంగా తెలిపిందని మస్క్ ట్వీట్ కు బదులిచ్చారు. మరికొందరు సొంత యాప్ స్టోర్ స్టార్ట్ చేయమని సూచింస్తున్నారు.

Read more about: elon musk twitter iphone apple
English summary

Elon Musk: ఐఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. మస్క్ మళ్లీ మాటమార్చేశాడు ఫ్రెండ్స్..! | Elon musk going to raise bluetick price to apple iphone users know details

Elon musk going to raise bluetick price to apple iphone users know details
Story first published: Friday, December 9, 2022, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X