Elon Musk News: X యూజర్లకు ఎలాన్ మస్క్ బిగ్ షాక్.. ఇకపై ట్వీట్ చేయాలంటే..
Pay for tweet: ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌లో పలు మార్పులు జరిగాయి. లేఆఫ్స్ దగ్గర నుంచి వర్కింగ్ మోడల్ వరకు అన్నింటినీ మార్చేశారు. కంటెంట్ క్రియేటర్స్‌కు రెవెన్యూలో షేరింగ్ ఇస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. కాగా ఇప్పుడు మరో కీలక అనౌన్స్‌మెంట్ చేశారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ X(గతంలో ట్విట్టర్)ను ఉపయోగించాలంటే ఇకమీదట వినియోగదారులు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఈ మేరకు కొత్త X వినియోగదారుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేయాలని ఎలోన్ మస్క్ భావిస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. దీంతో బాట్ సమస్యను అరికట్టవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నివేదిక ప్రకారం.. వెబ్‌సైట్‌లో మార్పుల గురించి Xలో ఓ పోస్ట్ చేయబడింది. బాట్‌ల దాడిని ఆపడానికి కొత్త ఖాతాలకు తక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేయడం ఒకటే మార్గం అని మస్క్ భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోని AI టెక్నాలజీ 'ఆర్ యు ఎ బాట్' చెక్ ని సులభంగా పాస్ చేయగలవని నమ్ముతున్నారు. అయితే 3 నెలల తర్వాత కొత్త ఖాతాలు రుసుము చెల్లించకుండా పోస్ట్ చేయవచ్చని ఓ వినియోగదారుడికి ఆయన సమాధానమిచ్చారు.
2022లో 44 బిలియన్ డాలర్లను వెచ్చించి ఎలాన్ మస్క్ Xని స్వాధీనం చేసుకున్నారు. ప్రకటనదారుల పట్ల కంపెనీ అనుసరించిన తీరు X ఆదాయ అవకాశాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. సెన్సార్ టవర్ డేటా ప్రకారం అక్టోబర్ 2022 నుంచి USలోని టాప్ 100 అగ్రశ్రేణి ప్రకటనదారులలో 75 మంది ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటన బడ్జెట్‌ను పూర్తిగా తగ్గించేశారు. ప్రస్తుతం నెలకు 8 డాలర్ల ప్రీమియంతో లభిస్తున్న మస్క్ AI చాట్‌బాట్ 'గ్రోక్'.. పోస్టులను కంపోజ్ చేయడానికి X వినియోగదారులందరికీ త్వరలోనే అందుబాటులోకి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications