ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్: గంటకు 8 కోట్లు ఖర్చు పెట్టినా వందేళ్లకైనా తరగని ఎలాన్ మస్క్ ఆస్తి!

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ (elon musk) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఏం చేసినా సంచలనమే. అయితే ఇప్పుడు బిజినెస్ ప్రపంచంలో ఆయన ఒక అసాధ్యమైన మైలురాయిని అందుకున్నారు. మానవ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (Trillionaire) గా అవతరించారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆయన ఆస్తి విలువ దాదాపు రూ. 100 లక్షల కోట్లకు పైనే అన్నమాట!

Elon Musk First Trillionaire Net Worth SpaceX IPO Tesla Stock Market News CNN Bloomberg

ఒక్క రోజులో మారిన రాత.. ఆకాశాన్ని తాకిన స్పేస్‌ఎక్స్!

తాజాగా జూన్ 12, 2026 న ఎలన్ మస్క్ (elon musk) కి చెందిన రాకెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) అమెరికా షేర్ మార్కెట్ అయిన నాస్‌డాక్ (Nasdaq) లో లిస్ట్ అయింది. "SPCX" టిక్కర్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ షేర్లు.. అనుకున్న ధరకంటే భారీ రేటుకు ట్రేడ్ అయ్యాయి. చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓ (IPO) గా నిలిచింది. దీని ద్వారా కంపెనీ ఏకంగా 75 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో స్పేస్‌ఎక్స్ కంపెనీ మొత్తం విలువ దాదాపు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో మస్క్‌కు ఉన్న షేర్లతో పాటు టెస్లా (Tesla) కంపెనీలో ఉన్న వాటాలన్నీ కలిపి ఇప్పుడు ఆయన మొత్తం నెట్ వర్త్ 1.26 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఒక మిలియన్ డాలర్లు.. ప్రతి గంటకూ ఖర్చు పెట్టినా!

ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత పెద్ద మొత్తమో ఊహించడం కూడా కష్టమే. అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక వ్యక్తి రోజులో 24 గంటలూ, ఎక్కడా ఆగకుండా, ప్రతి గంటకు ఒక మిలియన్ డాలర్లు (అంటే దాదాపు రూ. 8.3 కోట్లు) ఖర్చు పెడుతూనే ఉన్నాడనుకుందాం. అలా ఖర్చు పెట్టినా కూడా మస్క్ దగ్గరున్న డబ్బులు ఐపోవడానికి కనీసం 114 ఏళ్లకు పైగా టైమ్ పడుతుంది! అంటే ఇప్పుడు మొదలుపెడితే దాదాపు ఏడాది 2140 వరకు ఆయనకు పైసా అప్పు కాదన్నమాట. అయితే ఇదంతా పేపర్ వెల్త్ (షేర్ల విలువ) మాత్రమే అని, మార్కెట్ హెచ్చుతగ్గులపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే పెద్దది!

ఎలన్ మస్క్ సంపద ఎంత పెద్దదో చెప్పడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఒక ఆసక్తికరమైన లెక్క చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 దేశాల ఎకానమీ మాత్రమే 1.1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అంటే తైవాన్ లాంటి ఎన్నో దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే మస్క్ ఆస్తి చాలా ఎక్కువ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గూగుల్ ఫౌండర్స్ లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , అమెజాన్ జెఫ్ బెజోస్.. ఈ ముగ్గురి ఆస్తులను కలిపినా కూడా మస్క్ ఆస్తి కంటే తక్కువే! ఇక షేర్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ లాంటి వాళ్లు ఏడుగురు కలిస్తే వచ్చే ఆస్తి ఇప్పుడు ఒక్క ఎలోన్ మస్క్ దగ్గర ఉంది. ఈ రేంజ్ సంచలనం చూస్తుంటే మున్ముందు మస్క్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+