Tesla Layoffs: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఈక్రమంలో కొత్త దేశాల్లో వ్యాపార విస్తరణ, ప్లాంట్ల ఏర్పాటు వంటి నిర్ణయాలను సైతం మస్క్ తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
టెస్లా టెక్సాస్, కాలిఫోర్నియాలో 6,620 మంది కార్మికులను తొలగించింది. టెస్లా కార్లకు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన డిమాండ్, తక్కువ మార్జిన్ల కారణంగా ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాి టెస్లాలో 1,40,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. అమెరికా కార్మిక చట్టాల ప్రకారం ఏదైనా కంపెనీలో 100 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తే తప్పనిసరిగా వారికి 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

తాజా పరిస్థితుల్లో టెస్లా కాలిఫోర్నియాలో 3,332 మంది ఉద్యోగులను, టెక్సాస్‌లో 2,688 మంది కార్మికులను తొలగించినట్లు కంపెనీ నోటీసు వెల్లడించింది. ఈ తొలగింపుల ప్రక్రియ జూన్ 14 నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. టెక్సాస్ యూనిట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12% తగ్గింది. అలాగే న్యూయార్క్ యూనిట్‌లో పనిచేస్తున్న 285 మంది ఉద్యోగులు కూడా కోతలో ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల్లో కంపెనీ కొత్త, మరింత సరసమైన వాహనాలను నిర్మిస్తుందని చెప్పారు. ఫలితంగా గతంతో పోలిస్తే ఖర్చులు తగ్గటంతో పాటు ఉత్పత్తి చేయబడిన వాహనాల సంఖ్య పెరగనుంది.
టెస్లా కాలిఫోర్నియా ఇప్పటివరకు 30,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించిందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. టెస్లా గత సంవత్సరం వరకు ఆర్థిక సంక్షోభంతో ప్రభావితం కాలేదు. పైగా నిరంతరం కొత్త ఉద్యోగులను నియమించుకుందని వెల్లడైంది. 2021లో టెస్లా ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇది గత ఏడాది 1.40 లక్షలను అధిగమించింది. అయితే ప్రస్తుతం క్షీణించిన వ్యాపార పరిస్థితుల దృష్ట్యా కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 10 శాతం తగ్గించాలని చూస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఈ తొలగింపులు కొనసాగవచ్చని తెలుస్తోంది.
దీనికి ముందు 2020 తర్వాత తొలిసారిగా ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు క్షీణించాయి. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి కొత్త కంపెనీల ప్రవేశం టెస్లాకు గట్టి సవాలును సృష్టించిందని తెలుస్తోంది. ఇటీవల అనేక కొత్త చైనా కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించాయి. చైనాకు చెందిన BYD తన ఈవీ కార్ల అమ్మకాల పరంగా ఇప్పటికే టెస్లాను అధిగమించింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications