Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తి చేశారు. దీంతో గురువారం మస్క్ ట్విట్టర్ ఇంక్ కొత్త యజమాని అయ్యారు.
వచ్చీ రాగానే మస్క్ ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించటం సంచలనంగా మారింది. తనను తప్పుదారి పట్టించారనే నెపంతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
టెస్లా సీఈవో తాను ట్విట్టర్‌లో స్పామ్ బాట్‌లను "ఓడించాలని" కోరుకుంటున్నానని అన్నారు. యూజర్లకు కంటెంట్ ఎలా అందించబడుతుందో నిర్ణయించే అల్గారిథమ్‌లను పబ్లిక్‌గా అందుబాటులో ఉంచాలని ఆయన భావిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వేషం, విభజన కోసం ప్రతిధ్వని గదిగా మారకుండా నిరోధించాలని అన్నారు. సెన్సార్‌షిప్‌ను మస్క్ పరిమితం చేశాడు.

బిలియన్ డాలర్ల డీల్..
ట్విట్టర్ డీల్ విషయంలో ఆరు నెలలపాటు న్యాయపోరాటం, అనేక తగాదాల తర్వాత ఎలాన్ మస్క్ చివరికి 44 బిలియన్ డాల్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ లను తొలుత కంపెనీ నుంచి మస్క్ తొలగించారు.

ప్రైవేటు కంపెనీ..
ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి వాటాదారులను కలిగి ఉన్న ట్విట్టర్.. మస్క్ డీల్ తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ట్విట్టర్ షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు 54.20 డాలర్లను చెల్లించి కంపెనీని సొంతం చేసుకున్నారు. దీంతో ఎలాన్ మస్క్ ఏకైక వాటాదారుడిగా కంపెనీలో అవతరించనున్నారు. అందువల్ల ఇకపై కంపెనీకి సంబంధించిన పూర్తి అధికారం ఎలాన్ మస్క్ తో పాటు కొంత మంది ఇన్వెస్టర్లకు మాత్రమే ఉండనుందని తెలుస్తోంది.

మెలికల తర్వాత..
అక్టోబరు 4న మస్క్ తాను ప్రతిపాదించిన నిబంధనలపై కొనసాగడానికి అంగీకరించాడు. దీంతో డెలావేర్ ఛాన్సరీ కోర్టు న్యాయమూర్తి ఇరుపక్షాలకు ఒప్పందాన్ని ముగించడానికి అక్టోబర్ 28 వరకు గడువు ఇచ్చారు. అయితే గడువు సమయానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు మస్క్ బ్యాంకర్స్, ఇతర ఫైనాన్సర్లతో చర్చలు జరిపారు.

ఉద్యోగుల తొలగింపు..
ఏప్రిల్‌లో లావాదేవీని ప్రకటించినప్పటి నుంచి ట్విట్టర్ ఉద్యోగులు తొలగింపుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వర్క్‌ఫోర్స్‌లో 75% మందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం కంపెనీ 7,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. బుధవారం ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు.. ఉద్యోగులను తగ్గించే ఆలోచన తనకు లేదని ఉద్యోగులతో చెప్పారు.


Click it and Unblock the Notifications