IT News: మస్క్ కంపెనీ ఇంట్రెస్టింగ్ జాబ్ పోస్ట్.. రోజూ 28 వేల జీతం.. పని ఏంటంటే..
Elon Musk: ఈ రోజుల్లో మంచి జాబ్ సంపాదించడం కత్తిమీద సాములా మారింది. మాస్టర్స్, PhDలు చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. ఉన్నత విద్యాభ్యాసం లేకపోయినా కూడా కొందరు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్ వారికంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. దీన్నిబట్టి కేవలం బాగా చదువుకుంటేనే మంచి సంపాదన అనే మూసరోజుల నుంచి ప్రస్తుత తరం బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది అనిపిస్తోంది.
ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్(ప్రస్తుత X) అధినేత నిర్వహణలోని టెస్లా కంపెనీ ఇచ్చిన జాబ్ ప్రకటన చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేము. కేవలం రోజుకు 7 గంటలు నడుస్తే గంటకు 4 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అంటే రోజుకు 28 వేలు సంపాదించేందుకు చేయాల్సిన పని 7 గంటలు నడవడమే. ఇది వినడానికి షాకింగ్‌గా ఉన్నా నిజమే.

హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌ను రూపొందించడానికి కంపెనీ కొనసాగుతున్న ప్రణాళికలలో భాగంగా టెస్లా ఈ జాబ్ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోల్ ద్వారా పలువురు ఉద్యోగుల నుంచి సేకరించిన వాకింగ్ డేటా సహాయంతో హ్యూమనాయిడ్ రోబోట్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. టెస్లా కెరీర్స్ ఈ ఉద్యోగం పేరును 'డేటా కలెక్షన్ ఆపరేటర్'గా పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించి సుదీర్ఘ వివరణ సైతం అందులో పొందుపరిచారు.
'డేటా సేకరణ బృందానికి మద్దతు ఇవ్వడానికి అనుకూల వ్యక్తుల కోసం టెస్లా వెతుకుతోంది. ఈ రోల్ ప్రాథమిక లక్ష్యాలు డేటాను సేకరించడం, ఇంజనీరింగ్ అభ్యర్థనలకు సహాయం చేయడం మరియు వివిధ పరికరాల అభిప్రాయాన్ని నివేదించడం. విజయవంతమైన అభ్యర్థి తప్పనిసరిగా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోగలగాలి. డైనమిక్ & వేగవంతమైన వాతావరణంలో సౌకర్యవంతంగా పని చేయాలి. రోబోటిక్స్ రంగంలో ఉత్సాహంతో, టెస్లా బాట్ అభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉన్నవారి కోసం చూస్తున్నాము' అని టెస్లా జాబ్ వివరాలను పోస్ట్ చేసింది.
అభ్యర్థి తప్పనిసరిగా రోజుకు 7 గంటలకు పైగా నడవగలగాలి. మోషన్ క్యాప్చర్ సూట్ మరియు VR హెడ్‌సెట్‌ను ఎక్కువ కాలం ధరించి ఆపరేట్ చేయగలగాలి. VR హెడ్‌సెట్‌ల ఉపయోగం, వర్చువల్ వాతావరణంలో ఎక్కువకాలం పనిచేయడం కొంతమందికి అసౌకర్యంగా ఉంటుంది. దీని ఫలితంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకుగాను నగదు మరియు స్టాక్ అవార్డుల ప్రయోజనాలతో పాటు వేతన పరిధి గంటకు 2 వేల 120 నుంచి 4 వేల వరకు చెల్లిస్తామని మస్క్ కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications