వికీపీడియాపై నోరుపారేసుకున్న ఎలాన్ మస్క్.. అలా చేస్తే బిలియన్ డాలర్లు ఇస్తానంటూ ఆఫర్
Elon MusK: ఇంటర్నెట్ లో ఏ విషయం గురించి తెలుసుకోవాలని అనుకున్నా మొదటగా ఆశ్రయించే వెబ్ సైట్ వికీపీడియా. అంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. అయితే ఈమధ్య కాలంలో ఎప్పుడైనా వికీపీడియా ఓపెన్ చేస్తే.. విరాళం ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఓ మెసేజ్ తరచుగా కనిపిస్తోంది. దీనిపై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు.
SpaceX, Tesla, X అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే ఆయన పోస్టులు అలా ఉంటాయి మరి. తాజాగా వికీపీడియాలో తరచుగా దర్శనమిస్తున్న విరాళాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తన అభిప్రాయంతో పాటు వికీపీడియా హోమ్ పేజీలోని మెసేజ్ స్క్రీన్ షాట్లను పోస్ట్ కి జతచేశారు.

వికీపీడియాకు బిలియన్ డాలర్లను మస్క్ ఆఫర్ చేశారు. అయితే అందుకు ఓ షరతు విధించారు. 'డిక్కీపీడియా'గా పేరు మార్చుకోవాలని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆయన ప్రతిపాదించినట్లు చేసి డబ్బు ఇవ్వగానే తిరిగి పేరు మార్చుకోమని వికీపీడియాను ఓ యూజర్ ప్రోత్సహించాడు. దానిపై X అధినేత స్పందిస్తూ.. 'కనీసం ఏడాదిపాటు ఆ పేరును అలాగే ఉంచాల్సి ఉంటుంది. నేను ఫూల్ ని కాదు lol' అంటూ రిప్లై ఇచ్చారు.
వికీమీడియా ఫౌండేషన్‌కు ఇంత డబ్బు ఎందుకు అవసరమని ఎలాన్ మస్క్ ప్రశ్నించారు. ఇది సైట్ నిర్వహణకు మాత్రం కాదన్నారు. వికీపీడియాలోని మొత్తం టెక్స్ట్ ను ఒక ఫోన్ లో కుదించవచ్చని అభిప్రాయపడ్డారు. మరెందుకు విరాళాలు సేకరిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. Xలో ఆయన చేసిన ఈ పోస్ట్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్‌లు వచ్చాయి.


Click it and Unblock the Notifications