Nvidia CEO: నెట్టింట వైరల్ అవుతున్న Nvidia CEO పాత వీడియో.. ఎలాన్ మస్క్ కామెంట్
Elon Musk News: జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని పైకి ఎదిగినవారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో సంచలనంగా మారిన Nvidia CEO కూడా ఇదే కోవలోకి వస్తారు. తాను గతంలో పడిన ఇబ్బందుల గురించి ఇటీవల ఓ వీడియోలో వివరించారు. అత్యంత దుర్భర పరిస్థితుల గుండా వెళ్లినట్లు చెప్పారు. దీనిపై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా స్పందించారు.
Nvidia CEO జెన్సన్ హువాంగ్ తన కెరీర్ ప్రారంభ వేళ 'డెన్నీస్'లో ఎదుర్కొన్న పని అనుభవాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్ని రకాల పనుల పట్ల తనకు గౌరవం ఉందని అందులో పేర్కొన్నారు. బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన జోన్ ఎర్లిచ్‌మాన్ ఈ పాత వీడియోను షేర్ చేశారు. అది స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మార్చిలో జరిగిన ఇంటర్వ్యూ రికార్డెడ్ వీడియో.

'నా దృష్టిలో ఏ పనీ తక్కువ కాదు. ఎందుకంటే నేను డిష్ వాషర్‌గా పనిచేశాను. టాయిలెట్లు శుభ్రం చేశాను. మీ అందరికంటే ఎక్కువ టాయిలెట్స్ నేను క్లీన్ చేసి ఉంటాను. చేసే పని ఏదైనా దానిపట్ల నాకు గౌరవం ఉంది. నేను చేయను అని మీరు భావించే అత్యంత హీనమైన పనిని నాకు చూపించలేరు. మీరు నాకు ఏదైనా పంపించి దాన్ని సమీక్షించడంలో సహాయం చేయమని కోరితే నా వంతు కృషి చేస్తాను. నేను దాన్ని ఎలా చేశానో మీకు చూపిస్తాను' అని హువాంగ్ ఆ వీడియోలో తెలిపారు.
సదరు వీడియోపై టెస్లా CEO ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు. పనిపట్ల హువాంగ్ కు ఉన్న నిబద్ధతపై ప్రశంసలు కురిపించారు. అది సరైన వైఖరి అని కితాబిచ్చారు. కరోనా సమయంలో టాయిలెట్ పేపర్ కొరత ఉన్నప్పటికీ, మా ఫ్యాక్టరీలు మరియు కార్యాలయాల్లో పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications