Elon Musk: ప్రపంచ కుబేరుడు దివాలా తీస్తే.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు..
Musk On Bankruptcy: ప్రస్తుతం ఇద్దరు ప్రపంచ కుబేరుల మద్య మాటల హీట్ పెరిగింది. ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‍గేట్స్ ఒక కండిషన్ ప్రకారం దివాలా తీస్తారని అన్నారు. టెస్లా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా ఇప్పటి వరకు మారి ఉంటే టెస్లాపై షార్ట్ పొజిషన్ కలిగి ఉన్న బిల్ గేట్స్ దివాలా తీసేవారని అన్నారు.
గతంలో టెస్లా దాని అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు బిల్ గేట్స్ లాభం పొందటం కోసం ఎలక్ట్రిక్ కార్ తయారీ సంస్థపై షార్ట్ చేసిన తర్వాత తాజాగా మళ్లీ మస్క్ దానిపై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టెస్లా కంపెనీ మార్కెట్ క్యాప్ 1.251 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అత్యంత విలువైన సంస్థగా ఉన్న ఆపిల్ విలువ 3.729 ట్రిలియన్లుగా ఉంది. అయితే ఈ కంపెనీని అధిగమించటానికి టెస్లా దాదాపు 200 శాతం వృద్ధి రేటును కొనసాగించాల్సి ఉంటుంది. అప్పట్లో మస్క్ కంపెనీపై గేట్స్ చేసిన బెట్ కారణంగా దాదాపు 1.5 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు వెల్లడించబడింది. అదే తప్పు గేట్స్ కొనసాగించి ఉంటే దివాలా తీసేవారని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

ఒకప్పుడు గేట్స్ చేసిన పని గురించి పరిశీలిస్తే.. టెస్లా కంపెనీ మూతపడుతుందని కంపెనీ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో బెట్ వేశారు. తన అంచనా ప్రకారం ఇప్పటికీ గేట్స్ ఇదే ఆలోచనను కలిగి ఉండొచ్చని, ఎవరైనా ఈ విషయాన్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు. గేట్స్ పర్యావరణం కోసం అంటూ ఫండ్ రైజ్ చేస్తూ కపటంగా నటిస్తూ తనను ఫండ్స్ అడగటం, అదే సమయంలో టెస్లా పతనం ద్వారా 500 మిలియన్ డాలర్లు సంపాదించాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత టెస్లా షేర్లు 50 శాతానికి పైగా పెరుగుదలను చూశాయి.
టెస్లాను మరణం నుంచి కాపాడీన వర్క్ ఫ్రమ్ ఆఫీస్..
కరోనా మహమ్మారి తర్వాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ కల్చర్ గురించి అవకాశం కల్పించాయి. పూర్తి స్థాయిలో ఆఫీసులకు తిరిగి రావటానికి చాలా కంపెనీల్లో ఉద్యోగులు నిరాకరించిన తర్వాత ఈ వెసులుబాటు కల్పించాయి. అయితే రెండేళ్ల కిందట మస్క్ టెస్లా ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాల్సిందేనని పంపిన మెయిల్ పొటోలను హనోవర్‌లోని CEO, క్రిస్ హ్లాడ్‌జుక్ పంచుకున్నారు. అందులో అతను టెస్లాను దివాలా తీయకుండా ఎలా రక్షించాడో వెల్లడించాడు. ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటల పాటు ఆఫీసు నుంచి పనిచేయాలని. ఏ లొకేషన్ లో పని అలాట్ చేసిన వ్యక్తులు అక్కడికే వెళ్లాలని, అలా పాటించని వారు రాజీనామా చేసినట్లు పరిగణిస్తామన్నారు. పనిపై సీరియస్ గా ఉన్న వ్యక్తులు అదే స్థాయిలో ఆఫీసులో కనిపించాలని పేర్కొన్నారు. తాను ఫ్యాక్టరీలో ఉంటూ సహచరులు కూడా పనిచేసేలా ప్రోత్సహించకుంటే టెస్లా ఎప్పుడో మూతపడేదని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications