టెస్లా జెట్ స్పీడ్, జెఫ్ బెజోస్‌ను దాటేసే దిశగా ఎలాన్ మస్క్ సంపద
ప్రపంచ కుబేరుడు మారిపోనున్నారు! గత కొద్దికాలంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు. ఈ స్థానంలోకి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దూసుకొస్తున్నారు. 2020లో 30 ర్యాంకులకు పైగా ఉన్న మస్క్ ఏడాది చివరి నాటికి టాప్ 2లోకి వచ్చేశారు. ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్ బెజోస్‌ను త్వరలోనే దాటవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెస్లా ఇంక్ షేర్, స్పెసెక్స్ కారణంగా మస్క్ సంపద వేగంగా పెరుగుతోంది.

బెజోస్‌కు చేరువలో మస్క్
బుధవారం ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా షేర్లు 2.8 శాతం మేర ఎగిశాయి. దీంతో టెస్లా మార్కెట్ క్యాప్ 716 బిలియన్ డాలర్లను అధిగమించింది. దీంతో కంపెనీ ప్రమోటర్ అయిన మస్క్ వ్యక్తిగత సంపద 181.1 బిలియన్ డాల్లను అధిగమించింది. దీంతో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు చేరువయ్యారు. బెజోస్ సంపద 183.4 బిలియన్ డాలర్లుగా నమోదయింది. జెఫ్ బెజోస్ కంటే దాదాపు 3 మిలియన్ల డాలర్లు మాత్రమే తక్కువగా ఉంది.

ఇద్దరి సంపద ఎంతంటే
ప్రస్తుతం అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.57 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అమెజాన్‌లో బెజోస్‌కు 11 శాతం వాటా ఉంది. టెస్లాలో ఎలాన్ మస్క్‌కు 20 శాతం వాటా ఉంది. 2017 అక్టోబర్ నుండి జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా నిలిస్తున్నారు.

మస్క్ సంపద...
2020లో జెఫ్ బెజోస్ సంపద భారీగానే పెరిగినప్పటికీ, ఎలాన్ మస్క్ ఆదాయం అంతకంటే ఎక్కువగా ఎగిసింది. గత ఏడాది సంపద 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. టెస్లా షేర్ ఈ కాలంలో 743 శాతం ఎగిసిపడింది. ఎస్ అండ్ పీ 500 సూచీలో నమోదు కావడంతో గత ఏడాది చివరలో స్టాక్స్ రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఇక, గత ఏడాది టాప్ 500 కుబేరుల సంపద 1.8 ట్రిలియన్ డాలర్లు జమయింది. టాప్ 5 కుబేరుల వాటా ఇందులో 100 బిలియన్ డాలర్లు.


Click it and Unblock the Notifications