న్యూ ఇయర్కి ఇంకా కొద్దీ రోజులే మాత్రమే ఉండగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ, స్పెస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ 400 బిలియన్ డాలర్ల సంపద సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ఎలోన్ మస్క్ కి చాలా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. అంటే నవంబర్ 5 నుండి అతని సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ ఏడాదిలో చూస్తే అతని సంపద 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.
స్పెస్ ఎక్స్ వాటాల విక్రయం, యుఎస్ రాజకీయ సంఘటనల అనుకూల ప్రభావం ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం వంటి ముఖ్యమైన అంశాలు ఈ మైలురాయి చేరుకోవడానికి తోడ్పడ్డాయి.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్పేస్‌ఎక్స్‌లో వాటాల విక్రయం తర్వాత ఎలోన్ మస్క్ మొత్తం సంపద విలువ సుమారుగా $50 బిలియన్లు పెరిగింది. దింతో ఎలోన్ మస్క్ మొత్తం సంపద విలువ $439.2 బిలియన్లకు చేరుకుంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మాత్రమే కాకుండా $400 బిలియన్ల మార్కును అధిగమించిన మొదటి వ్యక్తిగా ఎలోన్ మస్క్ కూడా నిలిచాడు.

SpaceX విజయం, ప్రత్యేకించి ప్రభుత్వ ఒప్పందాలు, మనుషులను అంగారక గ్రహానికి పంపే ప్లాన్స్ ఎలోన్ మస్క్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. NASA అండ్ US ప్రభుత్వంతో డీల్ ద్వారా కంపెనీ వాల్యూ బలపడింది, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్‌గా స్థానాన్ని పొందింది.
USలోని రాజకీయల వల్ల కూడా అతని సంపద పెరిగింది, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం. 2022 చివరిలో షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులు, టెస్లా స్టాక్ డీల పడిపోవడం కారణంగా ఎలోన్ మస్క్ మొత్తం సంపద పడిపోయింది, ఆ సమయంలో సుమారు $200 బిలియన్లకు పైగా కోల్పోయాడు. అయితే తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ ఎన్నికైన తర్వాత అక్కడి రాజకీయ ముఖచిత్రం గణనీయంగా మారిపోయింది.
ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ సుమారు 65% పెరిగింది. ట్రంప్ విధానాలు ఎన్నికల పోటీని తగ్గించడం అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్ క్రెడిట్ తొలగించడం ద్వారా ఎలోన్ మస్క్ కంపెనీలకు ముఖ్యంగా టెస్లాకు ప్రయోజనం చేకూరుస్తాయని, దీని వల్ల అతని వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుందని పెట్టుబడిదారులు ఊహించారు. ఈ అంచనాలు టెస్లా స్టాక్‌లో పెరుగుదలకు దారితీశాయి, దింతో ఎలోన్ మస్క్ సంపదను మరింత పెంచింది. ఎలోన్ మస్క్ ఆర్థికంగా అలాగే బహిరంగంగా, అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచారానికి సహకరిస్తూ మాజీ అధ్యక్షుడి విధానాలకు మద్దతుగా నిలిచాడు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల టెస్లా షేర్లతో పాటు, క్రిప్టోకరెన్సీలలో అతని షేర్స్ విలువ పెరిగాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఎలోన్ మస్క్ మొత్తం సంపద విలువ ఈ సంవత్సరం దాదాపు 68 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?



Click it and Unblock the Notifications