twitter: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఏ పని చేసినా ఓ సంచలనమే. ఓ ట్వీట్ చేసినా, ట్విట్టర్ ను కొనగోలు చేసినా, ఉద్యోగులకు ఉద్వాసన పలికినా.. వివాదాలు మాత్రం ఆయన వెన్నంటే ఉంటాయి ఎందుకో మరి. భారీ మొత్తం వెచ్చించి ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన అనంతరం అప్పటి CEO పరాగ్ అగర్వాల్ ను బయటకు పంపించారు. అన్నీ తానై కంపెనీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ట్విట్టర్ CEO గురించి తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఏ కంపెనీకీ CEOగా ఉండను:
ఈ ఏడాది చివరి నాటికి ట్విట్టర్ CEO పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కంపెనీని స్థిరపరచి, ఆర్థికంగా కొంత కుదురుకున్న అనంతరం తాను తప్పుకుంటానని స్పష్టం చేశారు. టెస్లా లేదా ట్విట్టర్, ఏ కంపెనీకీ తాను CEOగా ఉండాలని బావించడం లేదని తెలిపారు. ఈ మేరకు దుబాయ్ లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.

అప్పుడు ఇంజనీర్ గా, ఇప్పుడు CEO గా..
"మొదట ట్విట్టర్ ను స్థిరీకరించాలి. దాని అభ్యున్నతి కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాం. సంస్థ ఆర్థికంగా ఓ మంచి పొజిషన్ లో ఉందని నిర్ధారించుకున్న అనంతరం CEO పదవి నుంచి తప్పుకుంటాను. ఈ ఏడాది చివరి నాటికి అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని భావిస్తున్నాను. అనతరం కొత్త CEO కోసం వెదకాల్సి ఉంటుంది" అని మస్క్ పేర్కొన్నారు. స్పేస్ Xలో రాకెట్ ఇంజనీరింగ్, టెస్లా కార్లలో సాంకేతికత అభివృద్ధిలో విజయం సాధించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఓ CEOగా వ్యాపారాభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోందన్నట్లు అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ CEO గా కుక్క:
గతేడాది డిసెంబరులో ట్విట్టర్ CEO పదవి నుంచి తాను తప్పుకోవడంపై మస్క్ పోల్ నిర్వహించారు. మొత్తం 17 మిలియన్ల వినియోగదారులు అందులో పాల్గొన్నారు. వారిలో మెజారిటీ మంది(57.5 శాతం) పదవి నుంచి మస్క్ దిగిపోవాలని సూచించారు. ఇది జరిగిన తర్వాత, కొత్త CEO నియామకంపై ఎటువంటి సమాచారం అందించలేదు. తాజాగా తన పెంపుడు కుక్క ఫ్లోకీని ట్విట్టర్ CEO గా నియమించుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. దానికి CEO అని రాసి ఉన్న స్వెటర్ ధరిపంజేసి, ఎగ్జిక్యూటివ్ కుర్చీలో కూర్చోబెట్టిన ఫొటోని షేర్ చేశారు.


Click it and Unblock the Notifications