Stock Market: ఆసియా మార్కెట్లను వణికిస్తున్న వాతారవణం.. స్టాక్స్‌పై ఎఫెక్ట్ ఇదే..
Stock Market: స్టాక్ మార్కెట్లు చాలా సెన్సిటివ్. ప్రపంచంలో జరిగే అనేక విషయాలకు అవి రియాక్ట్ అవుతుంటాయి. ఇందులో వాతావరణం కూడా ఒక ప్రధానమైన అంశం. మనలో చాలా మంది ఇన్వెస్టర్లు వార్షాలకు స్టాక్ మార్కెట్లకు లింకేంటి అని అనుకోవచ్చు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసియాలోని కొన్ని కీలక మార్కెట్‌లలోని స్టాక్ పికర్‌లు హీట్ వేవ్స్ నుంచి వరదల వరకు తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఎల్ నినోకి సంబంధించిన ప్రమాదాలు పెరగటం, వాతావరణ మార్పులు వేగవంతమవడంతో రాబోయే ఇబ్బందులను సూచిస్తున్నాయి. తాజాగా వరదల కారణంగా ఆస్ట్రేలియాలోని న్యూక్రెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కు చెందిన టెల్ఫర్ గోల్డ్ మైన్ ఈ నెల ప్రారంభంలో మూసివేయబడింది. గత ఏడాది చివర్లో వర్షాలు వైట్‌హావెన్ లిమిటెడ్, BHP గ్రూప్ వంటి మైనర్లకు బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడింది.

అలాగే భారత్ విషయానికి వస్తే.. దశాబ్దం తర్వాత అత్యంత వేడి ఫిబ్రవరి, వైరల్ చర్మవ్యాధితో పశువుల మరణాలు పెరిగాయి. దీనివల్ల ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి కలిగిన దేశం పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. దీనికి తోడు వేసవి డిమాండ్ పెరగటం వల్ల పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వంటి డెయిరీ సంస్థల షేర్లు పెరుగుతున్నాయి. విపరీతమైన వాతావరణ పరిస్థితుల ఎల్లప్పుడూ ఖర్చులను పెంచుతాయి. అందువల్ల వ్యవసాయం కూడా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఆసియా, ఆస్ట్రేలియాకు వేడి, పొడి వాతావరణ పరిస్థుతులు సూచించబడుతున్నాయి. దీనివల్ల ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న భారతీయ స్టాక్‌లు.. పట్టణ-ఆధారిత షేర్ల కంటే ఎల్ నినో అంచనాల వల్ల తీవ్రంగా దెబ్బతింటాయని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ నివేదించింది.
ఇలాంటి పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్లలో ఓలటాలిటీ విపరీతంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. "భవిష్యత్తులో వెచ్చని వాతావరణంలో ప్రపంచ స్థాయిలో, చాలా భూభాగాల్లో తరచుగా వేడి తీవ్రతలు, తక్కువ చలి తీవ్రతలు ఉంటాయని వాస్తవంగా ఖచ్చితంగా చెప్పవచ్చు" అని వాతావరణ మార్పుపై UN ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ తన తాజా నివేదికలో పునరుద్ఘాటించింది.


Click it and Unblock the Notifications