అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Co.) హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభించింది.టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌ను ఆగస్టు 4న హైదరాబాద్ నగరంలో అధికారికంగా ప్రారంభించింది. ఇది సంస్థ యొక్క గ్లోబల్ డిజిటల్, డేటా, AI కార్యకలాపాలకు ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఉండనుందని కంపెనీ తెలిపింది. నగరంలోనిలో గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఈక్వినాక్స్ క్యాంపస్‌లో 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ సెంటర్ ద్వారా లిల్లీ ఇప్పటికే 100 మంది నిపుణులను నియమించుకుంది.
వచ్చే 2-3 ఏళ్లలో 1,500 మంది ఉద్యోగుల నియామకాన్ని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీలోని పనితీరు ముఖ్యంగా AI, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగాలపై ప్రధానంగా ఉండనుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎలి లిల్లీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ & డిజిటల్ ఆఫీసర్ డియోగో రౌ మాట్లాడుతూ.. మేము హైదరాబాద్‌ను ఒక సహజ భాగస్వామిగా చూస్తున్నాం.

ఇక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం, టాలెంట్, సహకార మంత్రం మమ్మల్ని ఆకర్షించిందని తెలిపారు. లిల్లీ యొక్క డిజిటల్.. ఫార్మా రంగానికి ఓ బలమైన మద్దతును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త కేంద్రం సంస్థ యొక్క "ల్యాబ్ నుండి రోగికి" ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. అంటే ఔషధ పరిశోధన.. అభివృద్ధితో పాటుగా మార్కెట్ విడుదల ప్రక్రియలు డిజిటల్ మద్దతుతో మరింత సమర్థవంతంగా మారనున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. ఎలి లిల్లీ వంటి దిగ్గజ సంస్థ ఇక్కడ తమ సెంటర్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గౌరవకరమైన విషయంగా పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న అనుకూల వ్యాపార వాతావరణానికి నిదర్శనమని తెలిపారు.
ప్రస్తుతం ఎలి లిల్లీ మధుమేహం, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్, రోగనిరోధక వ్యాధుల వంటి ప్రధాన ఆరోగ్య సవాళ్లపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేస్తోంది. ఈ కొత్త సెంటర్ ద్వారా ఆ రీసెర్చ్ మరింత వేగవంతమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సెంటర్ ద్వారా లిల్లీ భారతదేశ టెక్ ప్రతిభను వినియోగించుకోనుంది, హైదరాబాద్ గ్లోబల్ డిజిటల్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌గా ఎదిగేందుకు సహకారం అందించనుంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications