ఈ ఏడాది కొత్తగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ కొనాలనుకునే వినియోగదారులకు బిగ్ షాక్. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న తీవ్రమైన మెమరీ చిప్‌ల కొరత కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చిప్ తయారీ సంస్థలు అధిక లాభాలు అందించే ఏఐ సంబంధిత ఉత్పత్తుల వైపు దృష్టి మళ్లించడంతో సాధారణ వినియోగదారులకు అవసరమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం వేగంగా పెరుగుతోంది. దీనికి అవసరమైన హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితిలో శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ వంటి ప్రముఖ మెమరీ చిప్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానంగా హెచ్‌బీఎం చిప్‌ల తయారీకే కేటాయిస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే డీ-ర్యామ్ (DRAM), నాండ్ (NAND) ఫ్లాష్ మెమరీ చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది.

ఈ కొరత ప్రభావం ఇప్పటికే చిప్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు 50 నుంచి 60 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెరిగిన ఖర్చును పూర్తిగా కంపెనీలు భరించలేకపోవడంతో.. చివరకు వినియోగదారులపైనే ధరల భారం పడనుంది. రాబోయే రెండు నెలల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల ధరలు సగటున 4 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రభావం ఇప్పటికే భారత మార్కెట్‌లో కనిపించడం మొదలైంది. వివో, నథింగ్ వంటి కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను రూ.4 వేల నుంచి నుంచి రూ. 5 వేల వరకు పెంచాయి. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగితే.. 2026 సంవత్సరంలో మొబైల్ ఫోన్ అమ్మకాలు 11 నుంచి 14 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) హెచ్చరిస్తోంది. ధరల పెరుగుదల వల్ల వినియోగదారులు కొత్త గ్యాడ్జెట్లు కొనుగోలు చేయడాన్ని వాయిదా వేసే అవకాశం ఎక్కువగా ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు దిగ్గజ కంపెనీలు ఖర్చులు నియంత్రించేందుకు డిస్‌ప్లే, కెమెరా మాడ్యూల్స్, స్పీకర్లు వంటి ఇతర భాగాల నాణ్యతలో రాజీ పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వినియోగదారులకు లభించే ఉత్పత్తుల నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ప్రస్తుతం కొత్త మెమరీ చిప్ తయారీ ప్లాంట్లు పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది. మార్కెట్ అంచనాల ప్రకారం 2027 వరకు ఈ చిప్ కొరత కొనసాగవచ్చని, అప్పటివరకు ఎలక్ట్రానిక్స్ ధరలు స్థిరపడే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications