IPO Listing: పూర్తిగా మెప్పించలేకపోయిన 3 ఐపీవోలు.. మీకూ ఈ షేర్లు వచ్చాయా..??

IPO Latest News: ఈరోజు మెుత్తంగా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 5 కంపెనీల ఐపీవోలు అడుగుపెట్టాయి. అయితే ఎక్కువ శాతం కంపెనీలు ఇన్వెస్టర్లకు ఊహించిన స్థాయిలో లాభాలను అందించటంలో విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు.

ముందుగా శాంతి స్పింటెక్స్ కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా చేయబడ్డాయి. ఉదయం స్టాక్ 8.57 శాతం ప్రీమియం ధర రూ.76 వద్ద విజయవంతమైన లిస్టింగ్ నమోదు చేసింది.

Electro force, shanti spintex, credo brands ipos made decent listing and gained after listing

దీని వాస్తవ ఇష్యూ ధర రూ.70గా ఉంది. 11.50 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర 14 శాతం లాభంతో రూ.79.80 వద్ద కొనసాగుతోంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.31.25 కోట్లను సేకరించిన సంగతి తెలిసిందే.

Electro force, shanti spintex, credo brands ipos made decent listing and gained after listing

ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన మరో ఐపీవో క్రెడో బ్రాండ్స్. కంపెనీ షేర్లు మార్కెట్లలో ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేశాయి. ఈ క్రమంలో బీఎస్ఈలో రూ.282 రేటు వద్ద, ఎన్ఎస్ఈలో రూ.282.35 రేటు వద్ద జాబితా చేయబడ్డాయి. గ్రేమార్కెట్ ధర ప్రకారం ఇష్యూ కంటే 30 శాతం ప్రీమియం రేటు రూ.360 వద్ద జాబితాను ఇన్వెస్టర్లు ఊహించినప్పటికీ అలా జరగలేదు. క్రెడో బ్రాండ్స్ వాల్యుయేషన్, బలమైన ఆర్థిక ట్రాక్ రికార్డ్, బాగా స్థిరపడిన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, వేగంగా పట్టణీకరణ, మెన్స్ దుస్తుల విభాగంలో రెండంకెల వృద్ధిని నమోదు చేయటం అంచనాలకు కారణంగా ఉంది.

Electro force, shanti spintex, credo brands ipos made decent listing and gained after listing

నేడు చివరగా మార్కెట్లోకి వచ్చిన ఐపీవో ఎలక్ట్రో ఫోర్స్ ఇండియా. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో అడుగుపెట్టిన కంపెనీ షేర్లు ఉదయం ఇష్యూ ధర కంటే 7 శాతం ప్రీమియం రేటు వద్ద జాబితా అయ్యాయి. అయితే మధ్యాహ్నం 12.03 గంటల సమయంలో మార్కెట్లో 13 శాతం లాభపడి రూ.105 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.80.68 కోట్లను సమీకరించింది. అలాగే కంపెనీ లాభాలను పరిశీలిస్తే రూ.7.80 కోట్లుగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+