దేశంలో వేడి తీవ్రత భారీగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయి. దీంతో దాదాపు అందరు ఇళ్లే పరిమితమవుతున్నారు. ఆఫీసులున్న వారు ఉదయం 11 గంటల లోపే వెళ్లిపోతున్నారు. వేడి తీవ్రతతో ఇళ్లు, కార్యాలయాల్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వాడకం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. కరెంట్ వినియోగం ఏప్రిల్ నెలలో గత సంవత్సరం కంటే 11 శాతం పెరిగి 144,25 బిలియన్ యూనిట్లకు చేరింది.
2023 ఏప్రిల్ లో విద్యుత్ వినియోగం 130.08 బిలియన్ యూనిట్లుగా ఉంది. 2024 ఏప్రిల్‌లో 2023 ఏప్రిల్‌లో ఒక రోజుకు 215.88 గిగావాట్లుగా ఉండేది. ఇప్పుడు అది 224.18 గిగావాట్లకు పెరిగింది. ఒక గిగావాట్ 1000 మెగావాట్లకు సమానం. ఈ వేసవిలో గరిష్టంగా 260 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కు, విద్యుత్ వంటి రంగాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల డిమాండ్ పెరగడానికి కారణమని రంగ నిపుణులు తెలిపారు.

2023 వేసవిలో దేశంలో విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుతుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే అకాల వర్షాల కారణంగా ఏప్రిల్-జూలైలో అంచనా స్థాయికి చేరుకోలేదు. ఇప్పుడు అంచనా వేసిన స్థాయికి విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.2023 ఆగస్టులో గరిష్ట డిమాండ్ 238.82 GW వద్ద ఉంది.సెప్టెంబర్‌లో ఇది 243.27 కు పెరిగింది. అక్టోబర్‌లో 222.16 గిగావాట్లకు తగ్గింది. నవంబర్‌లో 204.77 గిగావాట్లకు తగ్గింది.
డిసెంబర్ 2023లో 213.79 గిగావాట్లకు పెరిగింది. జనవరి 2024లో 223.51 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి 2024లో విద్యుత్ డిమాండ్ 222.72 గిగావాట్లుగా ఉంది. ఇది మార్చి, ఏప్రిల్ లో భారీగా పెరిగింది. విద్యుత్ వినియోగం పెరిగితే పవర్ సెక్టర్ లో ఉన్న కంపెనీలకు పాజిటివ్ గా ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications